STOCKS

News


14నెలల గరిష్టం వద్ద పసిడి ధర

Friday 14th June 2019
Markets_main1560491594.png-26282

పసిడి ధర శుక్రవారం 14నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రికత్తలు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు పసిడి ర్యాలీకి ఊతమిస్తున్నాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర డాలర్లు లాభపడి 1,348.85డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న గల్ఫ్‌ ఒమన్‌ ప్రాంతంలో గురువారం రెం‍డు చమురునౌకలపై గుర్తు తెలియని దుండగలు దాడి చేయడంతో మధ్య ప్రా‍చ్యదేశాల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు అమెరికా రిజర్వ్ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై కోత విధించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ వడ్డీరేట్లు నాన్‌ ఈల్డ్‌ బులియన్‌పై దిగుమతిని తగ్గిస్తాయి. అలాగే డాలర్‌ ఇండెక్స్‌పై ఒత్తిడి కలుగజేస్తుంది. ఫలితంగా మార్కెట్లో పసిడి ధరలకు డిమాండ్‌ పెరుగుతుంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర వరుసగా మూడో లాభపడింది. మార్కెట్‌ ముగింపు సమయానికి ఔన్స్‌ పసిడి ధర 7డాలర్లు పెరిగి 1,343.70 డాలర్ల వద్ద ముగిసింది. 
దేశీయంగా రూ.111లు లాభం:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర లాభపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు సహకరిస్తుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.111.00లు లాభపడి రూ.33070.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7పైసలు క్షీణించి 69.58 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

భారత మార్కెట్ కీలకం

Friday 14th June 2019

భారీ మార్కెట్‌ కాబట్టి ప్రయోగాలు చేయొచ్చు కొత్త ఉత్పత్తులకు బాగా తోడ్పాటునిస్తోంది ఆ తరవాత ప్రపంచమంతటా తేవొచ్చు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ వ్యాఖ్యలు వాషింగ్టన్‌: టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొంగొత్త ఉత్పత్తులు ఆవిష్కరించడంలోనూ, అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో వాటిని ప్రవేశపెట్టడంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా భారత్‌ చాలా భారీ మార్కెట్‌ కావడంతో ఇక్కడిలాంటి ప్రయోగాలు చేయటం గూగుల్‌కు సాధ్యమవుతోంది. అమెరికా, ఇండియా వ్యాపార మండలి (యూఎస్‌ఐబీసీ) నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్‌’

ఏడాది కనిష్టాలకు ఆర్‌ క్యాప్‌, ఆర్‌హోమ్‌ఫైనాన్స్‌

Friday 14th June 2019

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ షేర్లు శుక్రవారం 52 వారాల కనిష్ఠాలకు చేరాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ 7శాతం నష్టంతో రూ.78.10 వద్ద ట్రేడవుతోంది.  రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ నాలుగు శాతం నష్టంతో రూ.14.30 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ కాపిటల్, రిలయన్స్‌ హోం, ఫైనాన్‌ కంపెనీలకు ఆడిటింగ్‌ సేవలందించే పీడబ్యూసీ అకస్మాత్తుగా ఆ సేవల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దృష్ఠి

Most from this category