STOCKS

News


పసిడి పడింది..

Saturday 15th September 2018
Markets_main1536992388.png-20285

పసిడి ధరకు అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాల పోటు తగిలింది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో 10 డాలర్లు నష్టపోయింది. ఆటోమొబైల్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రంగాల మెరుగైన పనితీరు కారణంగా అమెరికాలో ఆగస్ట్‌లో పారిశ్రామికోత్పత్తి 0.4 శాతం వృద్ధిని సాధించింది. దీంతో మార్కెట్‌ వర్గాలకు మరోసారి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు పెరిగాయి. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ శుక్రవారం ఇంట్రాడేలో 95.00 కీలక స్థాయిని తాకింది. అయితే చివరకి అరశాతం లాభంతో ​94.97 వద్ద ముగిసింది. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1200 డాలర్ల కీలక మద్దతు స్థాయిని కోల్పోయింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 1,198.30 డాలర్ల వద్ద స్థిరపడింది.   ఇక వారం పరంగా చూస్తే పసిడి 2 డాలర్ల స్వల్ప నష్టాన్ని మూటగట్టుకుంది. 
దేశీయంగా స్వల్ప క్షీణత..
పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా నష్టపోయినప్పటికీ.. దేశీయ మార్కెట్లో స్వల్పంగానే క్షీణించింది. దేశీయ మార్కెట్లో పసిడి డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణమైంది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10 గ్రాముల పసిడి ధర స్వల్పంగా రూ.12లు నష్టపోయి రూ.30438ల వద్ద ముగిసింది.



You may be interested

కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ కొనొచ్చు..

Saturday 15th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెం‍ట్రమ్‌ తాజాగా కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ స్టాక్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: సెం‍ట్రమ్‌ స్టాక్‌: కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ ఇండస్ట్రీ: మెటల్స్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.140 ప్రస్తుత ధర: రూ.99 అప్‌సైడ్‌: 42 శాతం సెంట్రమ్‌ తాజాగా కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.140గా నిర్ణయించింది. కేఎల్‌డీ మైన్‌ను కోల్పోవడం కంపెనీకి పాజిటివ్‌ అంశమని పేర్కొంది. కేఎల్‌డీ మైన్‌ను వేలంలో తొలిగా

రియల్టీపై ఎన్నికల ప్రభావం ఉంటుందా?

Saturday 15th September 2018

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, రెరా.. ఒకదాని వెంట మరొకటి రియల్టీ రంగాన్ని కుదిపేసింది. స్థానిక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో కాస్త తేలుకుంటున్న తరుణంలో ఈసారి ముందస్తు ఎన్నికల ప్రకటనతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎన్నికల ప్రభావం రియల్టీ రంగం మీద ఏమాత్రం ఉంటుంది? కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యే వరకూ స్థిరాస్తి ధరలు తగ్గుతాయా? అసలు ఎన్నికల సమయంలో రియల్టీ పెట్టుబడులు సరైందేనా? వంటి సందేహాలకు సమాధానమే ఈవారం

Most from this category