STOCKS

News


పసిడికి వడ్డీరేట్ల కోత అంచనాల జోష్‌..!

Saturday 13th July 2019
Markets_main1563005956.png-27043

పసిడి ధర రాత్రి అమెరికా మార్కెట్లో 11డాలర్లు లాభపడి 1,412.20 డాలర్ల వద్ద స్థిరపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు మరింత బలపడటం ఇందుకు కారణమైంది. వడ్డీరేట్లపై ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ మెతక ధోరణి వాఖ్యలు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మద్దతినిస్తున్నాయి. ప్రొడ్యూసర్ ప్రైజెస్‌ గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో పాటు, అమెరికా సూచీలు గరిష్టస్థాయిని అందుకున్న నేపథ్యంలో ఉదయం అక్కడి మార్కెట్లో కొంత అ‍మ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు బలపడంతో పసిడి ధరలపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ భారీగా పతనమైంది. పసిడి ధర కనిష్టస్థాయి(1,405.65 డాలర్ల) నుంచి రికవరి అయ్యి 1,418.65 డాలర్ల ఇంట్రాడే గరిష్టానికి పెరిగింది. అయితే చివరి గంటలో ట్రేడర్లు స్వల్పంగా లాభాల స్వీకరణకు స్వీకరణకు పూనుకోవడంతో పసిడి ధర 1,412.20డాలర్ల వద్ద స్థిరపడింది. స్వల్పకాలికంగా పసిడి ధర 1400-1450 డాలర్ల రేంజ్‌లో ట్రేడయ్యే అవకాశం ఉందని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వారం పసిడి మొత్తంగా 12డాలర్లు లాభపడింది. 
దేశీయంగానూ లాభాల ముగింపే...
దేశీయంగానూ పసిడి ధర శుక్రవారం భారీ లాభంతోనే ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. నిన్న రూపాయి మారకం విలువ 25పైసలు తగ్గి 68.69 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో ఎంసీక్స్‌లో మార్కెట్లో శుక్రవారం ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర గతముగింపు ధర(రూ.34701)తో పోలిస్తే రూ.204.00లు పెరిగి రూ.34905.00ల వద్ద స్థిరపడింది. ఈ వారంలో పసిడి మొత్తంగా పసిడి ధర రూ.422లు లాభపడింది. 



You may be interested

ఈ అపోహలు సంపద సృష్టికి అడ్డంకి

Saturday 13th July 2019

‘ఈక్విటీ మార్కెట్లలలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇది జూదం అని నమ్మేవారు దీని నుండి దూరంగా ఉండటానికి  ప్రయత్నిస్తుంటారు. స్టాక్ మార్కెట్లపై అవగాహన కలిగి ఉన్నవారు త్వరగా డబ్బు సంపాదించే మార్గంగా దీనిని భావిస్తారు. చాలామందికి ఈక్విటీ మార్కెట్లపై కొన్ని అపోహలున్నాయి’ అని ఎడల్‌వెయిస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రాహుల్‌ జైన్‌ అన్నారు. ఈ అపోహలపై స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించారు. ముఖ్యమైన విషయాలు ఆయన మాటల్లోనే.... అపోహ 01- మార్కెట్లలో

ప్రతికూలంగా ఉన్నా.. ఈ స్టాకులు రాణిస్తాయి

Saturday 13th July 2019

బడ్జెట్‌లో పబ్లిక్‌ హోల్డింగ్‌, సర్‌చార్జీలను పెంచడంతో బెంచ్‌మార్క్‌ నిఫ్టీ గత వారం నుంచి నష్టాల్లో ముగుస్తోంది. జులై 9 న 11,461  కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇప్పటికి కూడా ఆ స్థాయి దగ్గర్లోనే ట్రేడవుతోంది. 11,600  స్థాయిని పొందేందుకు బలహీనమైన ప్రయత్నాలను చేస్తుంది. బడ్జెట్‌ ఆందోళనల నేపథ్యంలో  వచ్చే వారం కూడా మార్కెట్లు నెగిటివ్‌గానే ట్రేడయ్యే అవకాశం ఉంది.      సాంకేతికంగా చెప్పాలంటే నిఫ్టీ 50  ఇండెక్స్‌ రోజువారి చార్ట్‌లలో

Most from this category