STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Wednesday 13th February 2019
Markets_main1550045754.png-24177

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. అమెరికా - చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్లకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌  పసిడికి బలానిస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్ల మేర బలపడి 1,317.55 డాలర్లకు చేరుకుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు 0.10శాతం క్షీణించి 96.442 కనిష్టాన్ని తాకింది. వ్యయాల బిల్లుకు కాంగ్రెస్‌ సూచనప్రాయ అనుమతి తెలియజేయడంతో రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిసిన్పటికీ అక్కడి మార్కెట్లో పసిడి ధర 2డాలర్లు లాభపడి 1,314.00 డాలర్ల వద్ద ముగిసింది. 
దేశ మార్కెట్లో స్వల్ప పెరుగుదల:- 
ఇక దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ ఎంసీక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.34.00లు పెరిగి రూ.32885.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 48 పైసలు బలపడిన నేపథ్యంలో పసిడి ధర రూ.32851 వద్ద ముగిసింది.



You may be interested

నష్టంలో బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 13th February 2019

ముంబై:- ప్రభుత్వం రంగ షేర్ల పతనంతో బుధవారం బ్యాంక్‌ నిఫ్టీ సూచీ 27000 కీలక సాంకేతిక స్థాయిని కోల్పోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్‌ దాదాపు 0.30శాతం(85 పాయింట్లు) వరకు నష్టపోయింది. మధ్యాహ్నం గం.2:30లకు ఇండెక్స్‌ గతముగింపు(27,010.75)    తో పోలిస్తే 0.24(56 పాయింట్లు) నష్టంతో 26,954 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో మొత్తం 12 షేర్లకు గానూ 8షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా 4షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

సెల్లింగ్‌కు సరైన సమయం ఎప్పుడు?

Wednesday 13th February 2019

మీరు కొన్న స్టాకు బాగా లాభాలను ఆర్జించినప్పుడు అమ్ముతారా, అట్టిపెట్టుకుంటారా? మీరు కొన్న స్టాకు ఆల్‌టైమ్‌ హైకి చేరినప్పుడు అమ్ముతారా, అట్టిపెట్టుకుంటారా?.... ఈ ప్రశ్నలకు చాలామంది అమ్మేస్తామనే సమాధానం ఇస్తారు. కానీ దిగ్గజ ఇన్వెస్టర్లు మాత్రం రివర్సులో సమాధానం ఇస్తారు. తాము కొన్న స్టాకులు 100 శాతం లాభాల్లో ఉన్నప్పుడు, ఆల్‌టైమ్‌ హైకి చేరినప్పుడు తాము విక్రయించమని చెబుతారు. ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా ఇందుకు సంబంధించి రెండు

Most from this category