STOCKS

News


పసిడి పయనం ఎటువైపు..

Saturday 14th July 2018
Markets_main1531561667.png-18322

  • అమెరికా బాండ్‌ ఈల్డ్, వడ్డీ రేట్లు, డాలర్‌ పెంపు భయాలు
  • స్వల్పకాలంలో దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు విశ్లేషకుల సూచన

బంగారంపై ఒత్తిడి నెలకొని ఉంది. ప్రసుత్తం ఔన్స్‌ విలువ 1,250 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పుత్తడి వెలుగు తగ్గడానికి డాలర్‌ బలపడటం ప్రధాన కారణం. మరి గోల్డ్‌ పయనం ఎటువైపు? కరక‌్షన్‌ దిశగా అడుగులు వేస్తోందా? కమోడిటీ నిపుణులు అనిశ్చితి ఇంకా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాను పెంచుకునే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.   
 ‘బంగారాన్ని ప్రభావితం చేసే తొలి అంశం అమెరికా డాలర్‌. ఇది ఏ కొంచెం బలపడినా అది పసిడిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక్కడ బంగారాన్ని ప్రభావితం చేసే మరో అంశం కూడా ఉంది. అది అమెరికా ట్రెజరీ ఈల్డ్‌. ఇందులో ఏ కొంచెం పెరుగుదల కనిపించినా ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లవైపు ఆకర్షితులౌతారని అప్పుడు స్వల్పకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రానున్న నెలల్లో అమెరికా వడ్డీ రేటు అంశం బంగారం ధరను నిర్దేశించడంలో కీలకంగా మారనుంది’ అని ట్రేడ్‌బుల్స్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ ఆసిఫ్‌ హిరానీ తెలిపారు. ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ‘అమెరికా వడ్డీరేటు పెరుగుదల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు వద్దని చెబుతాను. ఒకవేళ కామెక్స్‌లో ఔన్స్‌ ధర 1,200 డాలర్ల సమీపంలోకి వస్తే ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెట్టొచ్చు. గత రెండేళ్లుగా బంగారం 1,200 డాలర్ల దిగువున ఎప్పుడూ కూడా స్థిరపడలేదు. తిరిగి మళ్లీ పెరుగుతూ వస్తోంది’ అని పేర్కొన్నారు.  
గత ఆరు నెలలుగా చూస్తే బంగారంపై రాబడులు ప్రతికలముగా ఉన్నాయని వెల్త్‌ డిస్కవరీ డైరెక్టర్‌ రాహుల్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘బంగారానికి 1,250 డాలర్లను గట్టి మద్దతుగా భావిస్తున్నాం. ఒకవేళ ఈ స్థాయిని దాటి కిందకి వస్తే అప్పుడు 1,220 డాలర్లు మద్దతు స్థాయి’ అని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తన వృద్ధిని కొనసాగించినా.. అమెరికా వడ్డీ రేట్లు పెరిగినా.. అప్పుడు బంగారం ధర తగ్గుతుందని తెలిపారు. స్వల్ప కాలంలో బంగారం ర్యాలీ ఉండకపోవచ్చన్నారు. అయితే కమ్‌ట్రడ్జ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ మరో విశ్లేషణ చేశారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరగొచ్చని అంచనా వేశారు. వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్‌, చమురు ధరల పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. అయితే అమెరికా బాండ్‌ ఈల్డ్‌ పెరుగుదల వల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లు బంగారం కన్నా డాలర్‌కు ప్రాధాన్యమిస్తారని తెలిపారు. You may be interested

పర్యాటక రంగ స్టాకులను పట్టేయండి

Saturday 14th July 2018

దేశీయ ఎకానమీ బలోపేతం కావడంలో, ఉపాధి కల్పనలో టూరిజం కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల కాలంలో దేశంలోకి విదేశీ పర్యాటకుల సంఖ్య క్రమాగనుగత వృద్ధి నమోదు చేస్తోంది. ఇతర దేశాలతో పోటీగా భారత్‌లో సైతం ప్రభుత్వం పలురకాల టూరిజం మోడళ్లను అభివృద్ధి చేస్తోంది. మెడికల్‌ టూరిజం, వెల్‌నెస్‌ టూరిజం, కల్చరల్‌ టూరిజం, అడ్వంచర్‌ టూరిజం, క్రూయిజ్‌ టూరిజం లాంటి పలు మోడళ్లు అమిత జనాకర్షణ చేస్తున్నాయి. పలు పురాతన ప్రదేశాలను

10800పైన ఉన్నంత వరకు సేఫే!

Saturday 14th July 2018

నిఫ్టీపై నిపుణుల అంచనా చాలా రోజుల తర్వాత నిఫ్టీ 11వేల పాయింట్ల పైన ముగిసింది. గత ఆల్‌టైమ్‌ హైకి దగ్గరలో ట్రేడవుతోంది. మరో జీవితకాల గరిష్ఠానికి నిఫ్టీ చేరుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అయితే పైస్థాయిలో నెలకొన్న నిరోధం చాలా బలంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కొన్ని స్టాకులపై ఆధారపడి జరుగుతున్న ప్రస్తుత ర్యాలీకి అంత బలం ఉండకపోవచ్చని వీరి భావన. నిఫ్టీ గతవారం చూపిన జోరు చూస్తే వచ్చే

Most from this category