STOCKS

News


5వారాల గరిష్టానికి పసిడి

Friday 7th December 2018
Markets_main1544161116.png-22717

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 5వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపు అనుమానాలు తలెత్తాయి. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ పతనం, అమెరికా ట్రెజరీ ఈల్డ్‌ తగ్గడం పసిడి ధరకు బలాన్నిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండటం, వాణిజ్య యుద్ధ సంధిపై ఇన్వెస్టర్లకు విశ్వాసం లేకపోవడం, తాజాగా తలెత్తిన చైనా-అమెరికాల మధ్య రాజకీయ సంక్షోభాలు ఈక్విటీ మార్కెట్లను భారీగా పతనం చేశాయి. ఈ అనిశ్చితి వాతావరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల వైపుకు మళ్లిస్తున్నారు. ఫలితంగా పసిడి ధర శుక్రవారం ఆసియా ట్రేడింగ్‌లో 1,245.90 డాలర్ల గరిష్టానికి చేరుకుంది. ఇది పసిడి ధర 5వారాల గరిష్టస్థాయి. ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 2.10 డాలర్లు పెరిగి 1,245.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్ల పతనంతో అక్కడి 1,243.60 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా స్వల్ప తగ్గింపు:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నన్పటికీ.., దేశీయం మాత్రం స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం ఇందుకు కారణమవుతోంది. నేడు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర 48లు క్షీణించి రూ.31041ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 31089 వద్ద ముగిసింది.



You may be interested

అమెరికాలో ఇన్ఫోసిస్‌ కొత్త టెక్నాలజీ హబ్‌

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అమెరికాలో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాలోని హార్డ్‌ఫోర్డ్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఇన్ఫోసిస్‌ తెలిపింది. గత 18 నెలల్లో మొత్తం 7,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చామని పేర్కొంది. ఈ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు కీలకమైన మైలురాయని ఇన్ఫోసిస్‌ సీఓఓ యూబీ ప్రవీణ్‌ రావు తెలిపారు. 

ఎతిహాద్‌ నుంచి రుణానికి జెట్‌ ప్రయత్నాలు

Friday 7th December 2018

ముంబై: నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌.. తమ భాగస్వామ్య సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ను 350 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాల్సిందిగా కోరింది. ఓ వైపు సమస్యల నుంచి గట్టెక్కే క్రమంలో వాటా విక్రయ ప్రయత్నాలను కొనసాగిస్తూనే  మరోవైపు తక్కువ వడ్డీ రేటుపై ఈ మేరకు రుణం సమకూర్చాలంటూ జెట్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించాయి.

Most from this category