పసిడి నష్టాల ముగింపు
By Sakshi

ప్రపంచ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం పాటు డాలర్ ఇండెక్స్ బలపడటంతో పసిడి ధర శుక్రవారం నష్టంతో ముగిసింది. అమ్మకాల సునామీతో తల్లడిన అంతర్జాతీయ మార్కెట్లకు ‘‘అమెరికా దిగుమతి గణాంకాలు’’ వృద్ధి ఊరటనిచ్చాయి. మరోవైపు బ్రెగ్జిట్ వ్యవహరం నేపథ్యంలో బ్రిటన్ కరెన్సీ యూరో కూడా బలహీనపడింది. ఈ కారణాలతో డాలర్ ఇండెక్స్ మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో శుక్రవారం రాత్రి అమెరికాలో 95.06స్థాయికి తాకి చివరకు 94.96 స్థాయి వద్ద ముగిసింది. ఫలితంగా డాలర్ ఇండెక్స్‌కు విలోమానుపాతంగా ట్రేడయ్యే పసిడి ధరలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అంతకుముందు రోజైన గురువారం ఔన్స్ పసిడి 2వారాల గరిష్టానికి చేరుకువడంతో శుక్రవారం పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు కూడా పసిడి ధరలు తగ్గడానికి కారణమయ్యాయి. అమెరికా మార్కెట్లో నిన్న రాత్రి ఔన్స్ పసిడి ధర 5.90 డాలర్లు నష్టపోయి 1,222 డాలర్ల వద్ద ముగిసింది. అయితే వారం పరంగా చూస్తే 1.70 శాతం పెరిగింది.
దేశీయంగా తగ్గుదలే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గుదలతో పాటు ఫారెక్స్‌లో రూపాయి రికవరీతో దేశీయంగానూ పసిడి ధర నష్టపోయింది. ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 55 పైసలు బలపడింది. ఫలితంగా ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.151లు నష్టపోయి రూ.31840.00ల వద్ద ముగిసింది.
You may be interested
ఈ వారం పిక్: అరబిందో ఫార్మా
Saturday 13th October 2018బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా అరబిందో ఫార్మాను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ స్టాక్: అరబిందో ఫార్మా ఇండస్ట్రీ: ఫార్మాస్యూటికల్స్ ప్రస్తుత ధర: రూ.735 టార్గెట్ ప్రైస్: రూ.820-865 హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్.. అరబింతో ఫార్మాపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో స్టాక్ ధర రూ.820-865 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. కంపెనీ రానున్న కాలంలో అమెరికా, యూరప్ మార్కెట్లలో కొత్త ప్రొడక్టులను
జీ ఎంటర్టైన్మెంట్ కొనొచ్చు..
Saturday 13th October 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, ఆనంద్‌రాఠి తాజాగా జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశాయి. ఎందుకో చూద్దాం.. స్టాక్: జీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ: మీడియా ప్రస్తుత ధర: రూ.466 బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టార్గెట్ ప్రైస్: రూ.585 హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్.. జీ ఎంటర్టైన్మెంట్పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్ ధరను రూ.585గా నిర్ణయించింది. జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుత క్వార్టర్లోనూ బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. పీఏటీ