STOCKS

News


స్థిరంగా పసిడి

Friday 12th July 2019
Markets_main1562912776.png-27000

క్రితం ట్రేడింగ్‌లో 1శాతం వరకు క్షీణించిన పసిడి ధర శుక్రవారం ట్రేడింగ్‌లో స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు స్వల్ప లాభంతో 1,408.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత,  మరోసారి తెరపైకి వచ్చిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంకా తగ్గముఖం పట్టని అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు పసిడి ధరకు మద్దతునిస్తు‍న్నాయి. కీలక వడ్డీరేట్లపై కోత ఉండవచ్చని ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రకటనతో  నిన్న ఉదయపు ట్రేడింగ్‌లో పసిడి ధర 2వారాల గరిష్టస్థాయి(1,428.95 డాలర్లు)ని తాకింది. అయితే రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో అక్కడి ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డు గరిష్టాలను తాకడం, అమెరికా కన్జూ‍్యమర్‌ ప్రైజ్‌ ఇండెక్స్‌ అంచనాలకు మించిన నమోదు కావడంతో పాటు పసిడి 2వారాల గరిష్టాన్ని అందుకున్న నేపథ్యంలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు.  ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర 21డాలర్లు నష్టపోయి 1406.70డాలర్ల వద్ద స్థిరపడింది. 
దేశీయంగానూ స్థిరంగానూ:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర నేటి ట్రేడింగ్లో రూ.28.00లు స్వల్ప లాభంతో  రూ.34,729.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 14 పైసలు బలపడి 68.44 స్థాయి వద్ద ముగిసిన నేపథ్యంలో పసిడి ధర రూ.138 నష్టపోయి రూ.34701ల వద్ద స్థిరపడింది.



You may be interested

ఈ-కామర్స్‌లోకి బ్యాంక్ ఆఫ్ బరోడా

Friday 12th July 2019

బ్యాంకింగ్, వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫాం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తాజాగా ఈ-కామర్స్ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. తమ ఖాతాదారులకు వివిధ రకాల బ్యాంకింగ్‌ సేవలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను అందించడానికి ప్రత్యేకంగా 'డిజిటల్ కామర్స్ పోర్టల్‌' ఏర్పాటు చేస్తోంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడంలోను, నిర్వహించడంలోనూ తోడ్పాటు అందించే సంస్థల నుంచి బిడ్స్‌ను ఆహ్వానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. బిడ్ల దాఖలుకు జూలై

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 12th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కేపీఆర్‌ఎల్‌ మిల్‌:- ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూపై 20 శాతం పన్ను విధింపు ప్రతిపాదన నేపథ్యంలో కంపెనీ రూ. 260 కోట్ల బైబ్యాక్‌ ఇష్యూ ప్రణాళికను రద్దు చేసుకుంటున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు, ఇన్వెస్టర్లకు సమాచారం ఇచ్చింది. సల్జార్‌ ఎలక్ట్రానిక్స్‌:- కైసీ ఇండస్ట్రీస్ కొనుగోలును ప్రక్రియను పూర్తి చేసింది.  యూనిటెడ్‌ బేవరీజెస్:- కంపెనీ కొత్త సీఎఫ్‌ఓగా బెరెండ్‌ ఒడినిక్‌ నియమితులయ్యారు. ఎవర్‌రెడీ ఇండస్ట్రీస్‌:- ప్రమోటర్లు తాకట్టు పెట్టిన

Most from this category