STOCKS

News


2 నెలల గరిష్టానికి పసిడి

Friday 12th October 2018
Markets_main1539321199.png-21080

అమెరికా మార్కెట్లో బాండ్‌ ఈల్డ్‌ పెరగడంతో పాటు, డాలర్‌ ఇండెక్స్‌ దిగిరావడం ప్రపంచమార్కెట్లో పసిడి ధర 2నెలల గరిష్టానికి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లతో పాటు నెలకొన్న అమెరికా మార్కెట్లో నెలకొన్న అమ్మకాల భయాల నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఫలితంగా ఔన్స్‌ ధర పసిడి ధర గురువారం రాత్రి అమెరికా మార్కెట్లో 34.20డాలర్ల వరకు పెరిగి 1,227.60 డాలర్ల వద్ద ముగిసింది. ఇది పసిడికి రెండునెలల గరిష్ట స్థాయి. జూన్‌ 24 2016 తరువాత పసిడి ధర ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. రాత్రి అమెరికా మార్కెట్లలో పసిడి ధర భారీగా పెరిగిన నేపథ్యంలో నేడు ఆసియా మార్కెట్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకణకు పూనుకున్నారు. ఫలితంగా పసిడి ఆసియా ట్రేడింగ్‌లో స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఔన్స్‌ పసిడి 4డాలర్లు నష్టపోయి 1,223.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  
దేశీయంగానూ తగ్గుదలే:-
డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ కారణంగా పసిడి ధర శుక్రవారం దేశీయంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం ఉదయం ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర 156.00లు నష్టపోయి రూ.31835.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

సెన్సెక్స్‌ 600 పాయింట్లు జంప్‌..

Friday 12th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం జోరుమీదుంది. గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన ఇండెక్స్‌లు అదే ఊపును కొనసాగిస్తున్నాయి. ఉదయం 10:53 సమయంలో సెన్సెక్స్‌ 651 పాయింట్ల లాభంతో 34,652 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 10,432 వద్ద ట్రేడవుతున్నాయి. క్రూడ్‌ ధరలు తగ్గడం, రూపాయి బలోపేతమవ్వడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 34,702 పాయింట్ల గరిష్ట స్థాయిని, 34,279 పాయింట్ల కనిష్ట స్థాయిని

టీసీఎస్‌ బోణీ భేష్‌!

Friday 12th October 2018

ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్‌ అగ్రగామి టీసీఎస్‌ మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018-19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం 20.7 శాతం వృద్ధితో రూ. 30,541 కోట్ల నుంచి రూ.36,854 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా డాలరుతో రూపాయి

Most from this category