STOCKS

News


నెలరోజుల కనిష్టానికి పతనమైన పసిడి ధర

Saturday 10th November 2018
Markets_main1541831649.png-21864

డిసెంబర్‌లో కీలకవడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రాత్రి నెలరోజుల కనిష్టానికి పతనమయ్యాయి. గతరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ఏకంగా 16 డాలర్లు(1.30శాతం) నష్టపోయి 1210.30 డాలర్ల వద్ద ముగిసింది. ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి వడ్డీరేట్లపై యథాతద వైఖరిని అవలంభించింది. అయితే, ఈ డిసెంబర్‌లో కీలకవడ్డీ రేట్ల పెంపు కచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఊపందుకున్నాయి. వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో రాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో 0.20శాతం పెరిగి అక్టోబర్‌ 31తేదిన నమోదు చేసిన 16నెలల గరిష్టం 96.74స్థాయిని మరోసారి అందుకుంది. ‘‘ఫెడ్‌ ప్రకటన డాలర్‌ను బలోపేతం చేసింది. అలాగే డిసెంబర్‌లో వడ్డీరేట్ల పెంపుపై స్పష్టమైన అవగాహన రావడం కూడా పసిడి ఫ్యూచర్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచిన ప్రతిసారి డాలర్‌ బలపడుతోంది. ఎందుకంటే ప్రపంచంలో వివిధ దేశాల ఇన్వెస్టర్లు తన దేశీయ కరెన్సీని బంగారం రూపంలో డాలర్ల రూపంలోకి మార్చకునేందుకు ఇష్టపడుతారు.’’ అని ఆర్‌జేఓ ఫ్యూచర్స్ సీనియర్‌ మార్కెటింగ్‌ అధికారి బాబ్ హబెర్కోర్న్ తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం కూడా కమోటిడీ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది. శుక్రవారం రాత్రి బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 70డాలర్ల దిగువన ట్రేడైంది. ‘‘ముడిచమురు ధరలు పెరిగి ఆర్థికవ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడిన నేపథ్యంలో పసిడిని హెడ్జ్‌గా ఉపయోగిస్తారు. పసిడి ఆయిల్‌ మార్కెట్‌తో తనకున్న సంబంధాన్ని తిరిగి ఏర్పాటు చేసుకుందని మిగ్యుఎల్ పెరెజ్-సంటల్లా తెలిపారు.
ఇక వారం పరంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్‌ ఫ్యూచర్‌ కాంటాక్టు ధర వరసగా రెండోవారం నష్టంతో ముగిసింది. ఈ వారం కాంటాక్టు ధర 1,234.60 డాలర్ల వద్ద ప్రారంభమైంది. అమెరికా మధ్యంతర ఎన్నికలు, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల ప్రకటన అంశాలు పసిడి ధరపై ప్రభావాన్ని చూపాయి. 1,207.30 - 1,237.60 డాలర్ల కనిష్ట, గరిష్టస్థాయిలను నమోదు చేసింది. మొత్తం మీద గతవారం ముగింపు ధర (1230.90డాలర్లు)తో పోలిస్తే 1.64శాతం (20.60 డాలర్లు) నష్టపోయి 1210.30 వద్ద ముగిసింది. అగస్ట్‌ 12వ తేదితో ముగిసిన పసిడి వారంలో ఏకంగా  2.85శాతం 34.60డాలర్ల నష్టపోయింది. ఆ వారం తరువాత ఇంత స్థాయిలో పసిడి నష్టపోవడం ఇదేతొలిసారి.
దేశీయంగానూ నష్టాల్లోనే:-
 దేశీయంగానూ పసిడి ధర నష్టాల్లోనే ముగిసింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర భారీ పతనం, దేశీయ పారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం పసిడి పతనానికి కారణమయ్యాయి. ఎంసీఎక్స్‌లో మార్కెట్లో శుక్రవారం రాత్రి రూ.391.00లు నష్టపోయి రూ.31015ల వద్ద ముగిసింది. ముడిచమురు ధరలు పతనంతో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి భారీగా బలపడింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 50 పైసలు బలపడి 72.50 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లో శుక్రవారం ఔన్స్‌ పసిడి ఏకంగా 16 డాలర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇకవారం పరంగా చూస్తే ఎంసీక్స్‌లో ఈ వారం మొత్తం రూ.605లు నష్టపోయింది. డిసెంబర్‌ కాంట్రాక్టు ధర గతవారం రూ.31750ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.



You may be interested

డీఎల్‌ఎఫ్‌ టార్గెట్‌ @ 253

Saturday 10th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా రియల్టీ సంస్థ డీఎల్‌ఎఫ్‌ షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: డీఎల్‌ఎఫ్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.174 టార్గెట్‌ ప్రైస్‌: రూ.253 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా డీఎల్‌ఎఫ్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.253గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించిందని

శాంసంగ్‌ ఫోల్డబుల్ ఫోన్లో ఏమున్నాయి?

Saturday 10th November 2018

దక్షిణ కొరియాకు చెందిన అగ్ర శ్రేణి ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ఫోల్డబుల్ ఫోన్‌ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి వినియోగదారుల్లో చాలా తారా స్థాయిలోనే ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన శామ్‌సంగ్‌ డెవలపర్స్‌ సదస్సులో ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని అస్పష్ట వివరాలను కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ డెనిన్సన్‌ ఆవిష్కరించారు. చిన్న టాబ్లెట్‌ సైజులో జేబులో పట్టేంత పరిమాణంలోనే ఈ ఫోన్‌ ఉండనుంది. రానున్న నెలల్లోనే పెద్ద ఎత్తున తయారీకి

Most from this category