STOCKS

News


గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌లో అనుబంధ సంస్థ విలీనం

Saturday 15th September 2018
news_main1536987122.png-20269

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌లో ఆ కంపెనీ అనుబంధ సంస్థ, ఆస్టెక్‌ లైఫ్‌ సైన్సెస్‌ విలీనానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డ్‌ ఈ మేరకు ఆమోదం తెలిపిందని గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ పేర్కొంది. ఈ విలీన ప్రణాళికలో భాగంగా ప్రతి 10 ఆస్టెక్‌​ లైఫ్‌ సైన్సెస్‌ షేర్లకు 11 గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ షేర్లను జారీ చేస్తామని తెలిపింది.  ఈ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు, సెబీ, తదితర సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని పేర్కొంది. విలీనానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందన్న వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ షేర్‌ 1.8 శాతం లాభంతో రూ.588 వద్ద ముగిసింది. 



You may be interested

మాల్యా కేసులో మెతగ్గా వ్యవహరించలేదు: ఎస్‌బీఐ

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణ ఎగవేత ఖాతా వ్యవహారంలో మెతగ్గా వ్యవహరించలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధిపతి విజయ్‌మాల్యా 2016 మార్చి 2న భారత్‌ నుంచి వెళ్లిపోయారు. అయితే, అతన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని 2016 ఫిబ్రవరిలోనే లీడ్‌ బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ సూచించినప్పటికీ... ఆయన పరారైన నాలుగు రోజుల తర్వాత 13 బ్యాంకుల కన్సార్షియం సుప్రీం కోర్టును ఆశ్రయించిందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ

కస్టమర్లకు వాట్సాప్‌లో నోటీసులు!!

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘించే ఖాతాదారులకు సంబంధించి కేసులను సత్వరం పరిష్కరించుకునే క్రమంలో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా కూడా నోటీసులు పంపుతోంది. ఇప్పటిదాకా 250 పైచిలుకు సమన్లను వీటి ద్వారా పంపినట్లు బ్యాంకు అధికారి ఒకరు వెల్లడించారు. వీరిలో ఎక్కువమంది మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లకు చెందినవారని చెప్పారు. పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతున్నా చాలా మంది కస్టమర్లు

Most from this category