STOCKS

News


50-70 డాలర్ల శ్రేణిలో క్రూడ్‌: మూడీస్‌

Friday 9th November 2018
Markets_main1541757482.png-21827

  • అంతర్జాతీయ వృద్ధిరేటు నెమ్మదిస్తున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు మరింత చతికలపడే అవకాశం ఉందని అంచనా
  • వచ్చే ఏడాది భారత జీడీపీ 7.3 శాతంగా ఉండవచ్చు
  • మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ మేరీ డిరోన్ వ్యాఖ్య

అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిపి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చు. గడిచిన రెండు ఏళ్ల నుంచి 3.3 శాతం కొనసాగుతున్న పూర్తి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిలో 3 శాతానికి తగ్గిపోయే అవకాశం ఉంది. అలానే ప్రస్తుతం 5 శాతంగా ఉన్నటువంటి జీ20 జాబితాలోని ఎమర్జింగ్‌ మార్కెట్ల ఆర్థిక వ్యవస్థ గ్రోత్‌ రేటు వచ్చేఏడాదిలో 4.5 శాతానికి తగ్గిపోయే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ మేరీ డిరోన్ వ్యాఖ్యానించారు. వృద్ధి రేటు మందగించడం వల్ల ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితులను కష్టతరం చేస్తాయని, ఈ ఏడాదిలోనే ఇటువంటి చర్యలను మొదలుకాగా, వచ్చే రెండేళ్లలో పరిస్థితి మరింత క్లిష్టతరంగా ఉండనుందన్నారు. ఫలితంగా ముడిచమురు దిగుమతులు చేసుకుంటున్న దేశాల నుంచి డిమాండ్‌ తగ్గి వీటి ధరలు దిగివస్తాయన్నారు. ఇదే సమయంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం లాంటి అంశాలు వర్తక రంగాన్ని మరింత నిరుత్సాహపరుస్తాయని ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అంచనాలను వెల్లడించారు. ఆయిల్‌ దిగుమతి దేశాలు ద్రవ్యోల్బణం పెరగడం, కరెంట్‌ ఖాతాలోటు పెరగడం వంటి ప్రతికూలతలను ఎదుర్కొనున్న నేపథ్యంలో మీడియం టర్మ్‌లో క్రూడ్‌ ధరలు 50-70 డాలర్ల శ్రేణిలో కదలాడతాయని అంచనావేశారు. మరోవైపు అమెరికా వడ్డీ రేట్లు నెమ్మదిగా పెరిగేందుకు ఆస్కారం ఉందని, వాణిజ్య యుద్ధం కారణంగా వర్తకం దెబ్బతింటుందని వ్యాఖ్యానించిన ఈమె.. భారత్‌లో ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో పెరిగిన ఒత్తిడి కారణంగా ద్రవ్యలభ్యత నెమ్మదించిపోతోందన్నారు. రూపాయి విలువ పతనం కావడం, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగాలపై ఒత్తిడి పెరగడం వంటి అంశాలను బేరీజు వేసుకుని వచ్చేఏడాది భారత జీడీపీ 7.3 శాతంగా ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారవిడ. 
 



You may be interested

ఇండియన్‌ బ్యాంక్‌పై మొండిబాకీల బండ..

Friday 9th November 2018

నికర లాభం 67 శాతం డౌన్‌ పెరిగిన ఎన్‌పీఏలు షేరు 12 శాతానికిపైగా క్రాష్‌ ఇండియన్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్‌ నికర లాభం 67 శాతంమేర క్షీణించింది. రూ.150 కోట్లుగా నమోదయ్యింది. మొండిబకాయిల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.451 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.4,874

ఎన్నికల వేళ ఫోకస్‌లో రియల్‌ ఎస్టేట్‌, ఆటో రంగాలు

Friday 9th November 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ర్యాలీ చేశాయి. అయితే తర్వాత కరెక‌్షన్‌కు గురయ్యాయి. తొలి ఆరు నెలల కాలంలో పొందిన లాభాలను సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కోల్పోయాయి. ఇండియన్‌ మార్కెట్‌ ప్రస్తుతం కీలక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు చోటుచేసుకునే అంశాలు మార్కెట్‌ తర్వాతి ఏడాది గమనాన్ని, దిశను నిర్దేశిస్తాయి. జెరోధా కో-ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌ ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

Most from this category