News


గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌

Tuesday 16th April 2019
Markets_main1555386539.png-25149

కొద్ది రోజులుగా స్వల్ప శ్రేణిలో కదులుతున్న భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం దాదాపు అరశాతం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభంతో 39,100 పాయింట్లపైన ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 11,740 పాయింట్ల ఎగువన మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, ఐఓసీ, హీరో మోటోకార్‌‍్ప, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు 1-2 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌,టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 190 పాయింట్లు (0.6 శాతం) పెరిగి 30,300 పాయింట్ల స్థాయిని అందుకుంది. 



You may be interested

స్వల్ప నష్టంతో ప్రారంభమైన రూపాయి

Tuesday 16th April 2019

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం నష్టంతో ప్రారంభమైంది. నిన్న ముగింపు(69.42)తో పోలిస్తే 7 పైసల నష్టంతో 69.49ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ వారంలో మార్కెట్‌ రెండు రోజులు సెలవు(మార్చి 17న, మార్చి 19న) కావడంతో ఫారెక్స్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో సోమవారం 25పైసలు క్షీణించి 69.42 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ నిల్వలు క్రమంగా

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Tuesday 16th April 2019

ఆసియా సూచీలు స్వల్పహెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో మంగళవారం భారత్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 9.50 నిముషాలకు 40 పాయింట్ల లాభంతో 11,768 పాయింట్ల వద్ద కదులుతోంది. సోమవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,728 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా వుండగా, సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగియగా, తాజాగా ఆసియాలోని ప్రధాన సూచీలు స్వల్పహెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

Most from this category