STOCKS

News


ఏంజల్‌ బ్రోకింగ్‌ స్ట్రాంగ్‌ బెట్స్‌

Wednesday 13th February 2019
Markets_main1550038437.png-24167

దీర్ఘకాలంలో బలమైన రాబడులు(రిటర్న్‌ పొటెన్షియల్‌) అందించే సత్తా ఉన్న స్టాకులను ఏంజల్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది. ఆయా స్టాకులు ఎంత శాతం అప్‌మూవ్‌ జరపగలవో అంచనాలు వేస్తోంది. 
1. జేఎస్‌పీఎల్‌: 91 శాతం అప్‌సైడ్‌. గత ఐదేళ్లో ముడి స్టీల్‌ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసుకుంది. ప్రస్తుతం ఉన్న సామర్ధ్యంలో 50 శాతం వినియోగంలో ఉంది. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. 
2. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌: 86 శాతం అప్‌సైడ్‌. ఎస్‌ఓటీపీ వాల్యూషన్ల ప్రకారం స్టాకు మంచి వాల్యూషన్ల వద్ద ఉంది. ఐదేళ్లుగా 42 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. మరోపక్క ఎన్‌పీఏలు పెద్దగా పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. 
3. అశోక్‌లేలాండ్‌: 86 శాతం అప్‌సైడ్‌. గతేడాది భారీగా మార్కెట్‌ వాటా పెంచుకుంది. ఇదే సమయంలో బలమైన వృద్దిని కూడా నమోదు చేసింది. యాక్సి్‌ల్‌లోడ్‌ నిబంధనల ప్రభావం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అంచనా.
4. సియారామ్‌ సిల్క్‌: 78 శాతం అప్‌సైడ్‌. రెండేళ్లుగా విక్రయాలు, లాభాల్లో 14 శాతం చక్రీయవార్షిక వృద్ధి నమోదు చేస్తూ వస్తోంది. బలమైన బ్రాండ్‌, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌తో టైర్‌2,3 నగరాల్లో కూడా వేగంగా చొచ్చుకుపోతోంది.
5. జీఐసీ హౌసింగ్‌: 74 శాతం అప్‌సైడ్‌. బలమైన సీఏఆర్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. గృహరుణాల డిమాండ్‌ పెరగడం కలిసివచ్చే అంశం. కంపెనీ లోన్‌బుక్‌ రాబోయే రోజుల్లో 18 శాతం పెరుగుదల నమోదు చేస్తుందని అంచనా. ఇతర హెచ్‌ఎఫ్‌సీలతో పోలిస్తే ఆస్తుల నాణ్యత బాగుంది.
6. ఐనాక్స్‌ విండ్‌: 71 శాతం అప్‌సైడ్‌. పవన విద్యుత్‌ విభాగంలో కంపెనీ సాధించే వృద్ధి పెనుమార్పు తీసుకువస్తుంది. రాబోయే రోజుల్లో ఈపీఎస్‌ 7.5 రెట్లు పెరగవచ‍్చని అంచనా. పవన విద్యుత్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కంపెనీకి లాభదాయకం కానుంది. 
7. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌: 69 శాతం అప్‌సైడ్‌. ప్రీఓన్డ్‌ వాణిజ్యవాహనాలపై ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది. రాబోయే రెండేళ్లలో ఏయూఎంలో 20 శాతం చక్రీయవార్షిక వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. లోన్‌బుక్‌లో 20 శాతం పెరుగుదల ఆశిస్తోంది. వాల్యూషన్లు చౌకగా ఉన్నాయి.
8. మ్యుజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌: 59 శాతం అప్‌సైడ్‌. పెద్ద నగరాల్లో నెంబర్‌వన్‌ స్థానం సాధించింది. వచ్చే పదిహేనేళ్లకు సరిపడా మూలధనవ్యయాలు చేసినందున ఇకపై పెద్దగా పెట్టుబడుల అవకాశం ఉండకపోవచ్చు. మెయిన్‌టెనెన్స్‌ వ్యయాలు కూడా చాలా తక్కువగా ఉన్నందున ఎబిటాలో మంచి వృద్దిసాధించగలదు.
9. యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌: అప్‌సైడ్‌ 56 శాతం. వాలెట్‌ వ్యాపారంలో మెజార్టీ వాటా కోసం తాజాగా రెండు కొనుగోళ్లు చేపట్టింది. దీంతో రాబోయే రోజుల్లో లాభాల్లో 51 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉండగలదు.
10. మారుతీ సుజుకీ: 55 శాతం అప్‌సైడ్‌. పాసింజర్‌ వాహనాల మార్కెట్లో 52 శాతం వాటా ఉంది. కొత్త మోడళ్లతో ఈ వాటా మరింత పెరగవచ్చు. ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో వినిమయం మరింత పెరగనుంది. దీనివల్ల కంపెనీ మరింత జోరు కనబరుస్తుందని అంచనా. విక్రయాలు పెరిగితే మార్జిన్లలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. You may be interested

టాటా మోటార్స్‌ అంతర్జాతీయ అమ్మకాలు 12% డౌన్‌

Wednesday 13th February 2019

జనవరి సేల్స్‌ 1,00,572 యూనిట్లు న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాల్లో గతనెల 12 శాతం తగ్గుదల నమోదైంది. లగ్జరీ కార్ల విభాగానికి చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలను కలుపుకుని సంస్థ మొత్తం కార్ల అమ్మకాలు జనవరిలో 1,00,572 యూనిట్లుగా నిలిచాయి. 2018 జనవరిలో అమ్ముడైన 1,14,797 యూనిట్లతో పోల్చితే 12 శాతం క్షీణత నమోదైనట్లు కంపెనీ వివరించింది. ఇక వాణిజ్య వాహనమైన టాటా దేవూ విక్రయాలు 9 శాతం

కోల్‌ ఇండియా లాభం రూ.4,567 కోట్లు

Wednesday 13th February 2019

50 శాతం వృద్ధి  రూ.26,209 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ:  కోల్‌ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో ​‍త్రైమాసిక కాలంలో 50 శాతం ఎగసింది. గత క్యూ3లో రూ.3,043 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.4,567 కోట్లకు పెరిగిందని కోల్‌ ఇండియా తెలిపింది. బొగ్గు ఉత్పత్తి అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది.  విశ్లేషకులు ఈ కంపెనీ రూ.4,069 కోట్ల నికర లాభం

Most from this category