STOCKS

News


ఇంకా తగ్గించాలని ఓఎంసీలకు చెప్పం!!

Friday 12th October 2018
news_main1539318197.png-21067

న్యూఢిల్లీ: పెట్రోల్ రేట్లు తగ్గించాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించడం ద్వారా ప్రభుత్వం ఇంధన రేట్ల సంస్కరణలను పక్కన పెట్టి మళ్లీ పాత విధానాలకే మళ్లుతోందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఇది ఈ ఒక్కసారికి మాత్రమే పరిమితమని, మరోసారి జరగబోదని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇకపైనా మార్కెటింగ్ స్వేఛ్చ ఉంటుందని, ఇక ఓఎన్‌జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థలను కూడా ఇంధన సబ్సిడీ భారాన్ని భరించాలని కేంద్రం అడగబోదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఇంధన ధరలు ఎగియడంతో కేంద్రం ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను రూ. 2.50 మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో రూ. 1.50 ఎక్సయిజ్ సుంకాల తగ్గింపు రూపంలో ఉండగా, మిగతా రూ.1 భారాన్ని భరించాలంటూ చమురు కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఇంధన రేట్లపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా కేంద్రం ఈ విధమైన ఆదేశాలివ్వడంతో చమురు కంపెనీలకు (ఓఎంసీ) మళ్లీ సబ్సిడీల భారం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 
అక్టోబర్‌ 5న రేట్లను తగ్గించినప్పటికీ.. ఆ తర్వాత ఇంధన రేటు మళ్లీ పెరుగుతూ పోవడంతో కేంద్రం మరోసారి ఓఎంసీలను ధర తగ్గించమని సూచించవచ్చనే వార్తలొచ్చాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వీటిపై వివరణనిచ్చాయి. దీంతో గురువారం ఆయిల్ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్‌ 19 శాతం, బీపీసీఎల్‌ 7 శాతం, ఐవోసీ 8 శాతం ఎగిశాయి. బీఎస్‌ఈలో చివరికి హెచ్‌పీసీఎల్ షేరు సుమారు 15 శాతం పెరిగి రూ. 207.15 వద్ద, బీపీసీఎల్‌ 5 శాతం పెరుగుదలతో రూ. 278.65, ఐవోసీ 5 శాతం పెరిగి రూ. 131 వద్ద క్లోజయ్యాయి. పెట్రోల్ రేట్ల తగ్గింపు ప్రకటించినప్పట్నుంచీ ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీల షేర్ల ధరలు దాదాపు 20 శాతం దాకా క్షీణించాయి. 



You may be interested

సీపీఎస్‌ఈల విలీనంపై కేంద్రం కసరత్తు

Friday 12th October 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) విలీనం, కొనుగోళ్ల ప్రక్రియను (ఎంఅండ్‌ఏ) ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. ఇందుకోసం త్వరలోనే మర్చంట్ బ్యాంకర్స్, లీగల్ సంస్థల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంకా విలీనాలు, కొనుగోళ్లకు అనువైన సంస్థలను నిర్దిష్టంగా గుర్తించనప్పటికీ.. సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నట్లు వివరించాయి. దీంతో పాలనా

స్వల్పంగా పెరిగిన బీఓఐ రుణ రేటు

Friday 12th October 2018

ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) రుణ రేటు (ఎంసీఎల్ఆర్‌) రెండు కాలపరిమితులకు సంబంధించి అరశాతం పెరిగింది. దీనిప్రకారం- ఓవర్‌నైట్‌  (స్వల్పకాలపరిమితి) రుణ రేటు 8.05 శాతానికి పెరిగితే, నెల కాలపరిమితి రేటు 8.15 శాతానికి చేరింది. అక్టోబర్‌ 10 నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. మూడు (8.30 శాతం), ఆరు (8.50 శాతం), 12 నెలల (8.60 శాతం) రుణ రేట్లలో ఎటువంటి మార్పూ

Most from this category