STOCKS

News


ఇక నుంచి కొత్త ఫామ్‌-16

Wednesday 17th April 2019
news_main1555478640.png-25172

మరింత సమాచారం ఉండేలా మార్పులు
న్యూఢిల్లీ: యాజమాన్యాలు ఉద్యోగుల టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) వివరాలకు సంబంధించి జారీచేసే ఫామ్‌ -16 సర్టిఫికేట్‌ ఫార్మాట్‌ను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సవరించింది. హౌస్‌ ప్రాపర్టీ నుంచి ఆదాయాలు, ఇతర యాజమాన్యాల నుంచి పారితోషికాలు సహా విస్తృత ప్రాతిపదికన సమాచారం అందుబాటులో ఉండేలా ఫామ్‌-16ను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పన్ను ఎగవేతల నిరోధమే లక్ష్యంగా సమగ్రంగా ఈ ఫార్మాట్‌ను రూపొందించినట్లు ఆ వర్గాలు చెప్పాయి. వివిధ పన్ను పొదుపు పథకాల కింద కోతలు, పన్ను పొదుపు పథకాల్లో పెట్టుబడులు, ఉద్యోగులు అందుకునే వివిధ అలవెన్సులు అలాగే ఇతర వనరుల ద్వారా ఆదాయం, పొదుపు ఖాతాలో డిపాజిట్లపై వడ్డీలు, రిబేట్స్‌, సర్‌చార్జీలు.... ఇలా విస్తృత సమాచారం దీనివల్ల  అందుబాటులోకి వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసిన సవరిత ఫామ్‌-16 మే 12వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్‌ తాజా ఫామ్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.



You may be interested

విమానంలో కనెక్టివిటీ కోసం జియో దరఖాస్తు

Wednesday 17th April 2019

న్యూఢిల్లీ: ప్రయాణ సమయంలో విమానం లోపల కనెక్టివిటీ, డేటా సేవలందించేందుకు తమకు అనుమతివ్వాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టెలికాం విభాగానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఓర్టస్ కమ్యూనికేషన్స్, స్టేషన్ శాట్‌కామ్‌, క్లౌడ్ కాస్ట్ డిజిటల్ సంస్థలు ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్కు (డాట్‌) ఈ సౌకర్యం కోసం దరఖాస్తులు సమర్చించాయి. ఈ సేవలు అందించడానికి లైసెన్స్‌ తప్పనిసరి చేస్తూ గతేడాది డాట్‌ నిర్ణయం తీసుకోగా.. హ్యూస్‌ కమ్యూనికేషన్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్‌)

‘డీజిల్ కార్లు’ కొనసాగుతాయి: మారుతి

Wednesday 17th April 2019

న్యూఢిల్లీ: సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే డీజిల్ కార్ల ఉత్పత్తి ఇక మీదట కూడా కొనసాగుతుందని దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి బీఎస్‌-6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో ఈ తరహా కార్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనుందనే అనుమానాలకు సమాధానంగా సంస్థ చైర్మన్‌ ఆర్.సి భార్గవ ఈ మేరకు ప్రకటనచేశారు. ఉత్పత్తి నిలిపివేత అంశంపై బదులిచ్చిన

Most from this category