STOCKS

News


400బిలియన్‌ డాలర్ల దిగువకు ఫారెక్స్‌ నిల్వలు..!

Saturday 15th September 2018
news_main1537001752.png-20290

ముంబై:- రూపాయి పతనం దెబ్బకు ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయి. క్షీణిస్తున్న రూపాయిని ఆదుకోవడానికి రిజర్వు బ్యాంకు మారక ద్రవ్య మార్కెట్‌ (ఫారెక్స్‌)లో డాలర్లను విక్రయిస్తోంది. ఫలితంగా ఈ ఏడాదిలో తొలిసారిగా ఫారెక్స్‌ నిల్వలు తొలిసారిగా 400 బిలియన్‌ డాలర్ల దిగువకు చేరుకున్నాయి. విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు సెప్టెంబరు 7తో ముగిసిన వారానికి 819.5 మిలియన్‌ డాలర్లు తగ్గి 399.28 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండోవారం కావడం గమనార్హం. ఇదే వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 887.4 మిలియన్‌ డాలర్లు తగ్గి 375.09 బిలియన్‌ డాలర్లకు పరిమితమగా, పసిడి నిల్వలు 71.9 మిలియన్‌ డాలర్లు పెరిగి 20.23 బిలియన్‌ డాలర్ల చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 1.5 మిలియన్‌ డాలర్లు తగ్గి 1.47 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.



You may be interested

చర్చలు సరే.. టారిఫ్‌లు వేయండి!!

Saturday 15th September 2018

ఎవ్వరీ మాట వినను.. నా దారి నాదే.. అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఛైనాతో వాణిజ్య చర్చలకు అమెరికా సిద్ధమవుతున్నప్పటికీ,  ఈయన తాజాగా 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కొత్తగా సుంకాలను విధించమని సహాయకులను ఆదేశించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ టారిఫ్‌లు ఇదివరకు 50 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగేమతులపై విధించిన టారిఫ్‌లకు అదనం. ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న వాణిజ్య

సెప్టెంబర్‌ 19న రూ.10వేల కోట్ల సెక్యూరిటీల కొనుగోలు: ఆర్‌బీఐ

Saturday 15th September 2018

ముంబై:- రిజర్వ్‌బ్యాంకు రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటనను జారీ చేసింది. ప్రజలు, వాణిజ్యసంస్థలు, ఇతర విత్తసంస్థల నుంచి సెప్టెంబర్‌ 19న బహిరంగ మార్కెట్ కార్యకలాపాల(ఓఎంవో) ద్వారా ప్రభుత్వానికి చెందిన రూ.10వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది. మార్కెట్లో ద్రవ్య లభ్యత పెంచండంతో పాటు, రూపాయి పతనాన్ని అరికట్టేందుకు సెక్యూరిటీ కొనుగోలు సిద్ధమైనట్లు

Most from this category