STOCKS

News


ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 12th February 2019
Markets_main1549944518.png-24141

దేశీయమార్కెట్‌ మూడు రోజుల వరుస నష్టాల ప్రారంభానికి ముగింపు పలుకుతూ మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నేడు రిటైల్‌, ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కారణంగా నిఫ్టీ సూచీ 10900 స్థాయి వద్ద ఒడిదుడుకులకు లోనవుతోంది.  మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ షేర్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే ఎఫ్‌ఎంజీసీ షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం గం.9:30నిల.కు నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 10900 వద్ద, సెన్సెక్స్‌ 40 పాయింట్లు పెరిగి 36435 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
రిలయన్స్‌ ఇండస్టీ‍్రస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడగా, హెచ్‌సీఎల్‌, హీరోమోటర్‌కార్ప్‌, టీసీఎస్‌, ఇన్ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి.You may be interested

కేకేఆర్‌ చేతికి రామ్‌కీ ఎన్విరో

Tuesday 12th February 2019

మెజారిటీ 60 శాతం వాటా కొనుగోలు దీనికోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి ఈ రంగంలో ఇదే అతిపెద్ద డీల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ సేవల సంస్థ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో (ఆర్‌ఈఈఎల్‌) అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కేకేఆర్‌ 60 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇదివరలోనే ఈ మేరకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదరగా... ఈ లావాదేవీ ప్రక్రియ సోమవారం పూర్తయినట్లు

స్వల్పలాభాలతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..!?

Tuesday 12th February 2019

విదేశీ మార్కెట్లో  ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ మంగళవారం స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో ఉదయం గం.8:50ని.లకు 10916.50 వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు(10909.60) స్థాయి పోలిస్తే 7పాయింట్ల లాభంతో ఉంది. అందువల్ల నేడు నిఫ్టీ సూచీ లాభంతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ట్రేడ్‌ వార్‌ చర్చలపై ఆశావహంతో నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్న యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌,

Most from this category