STOCKS

News


జేఎల్‌ఆర్‌ అవుట్‌లుక్‌ను తగ్గించిన ఫిచ్‌

Saturday 15th September 2018
Markets_main1536951846.png-20259

ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ టాటా మోటార్స్‌ అనుబంధ కంపెనీ జేఎల్‌ఆర్‌ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. అయితే బీబీప్లస్‌ను మాత్రం యథాతథంగా కొనసాగించింది. 2010 నుంచి టాటా మోటార్స్‌కు పాడి ఆవుగా మారిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జీఎల్‌ఆర్‌) 2018లో మాత్రం గుదిబండగా మారింది. జూన్‌ క్వార్టర్లో నష్టాలను ప్రకటించాల్సి వచ్చింది. డీజిల్‌ కార్లకు వినియోగదారులు ప్రాధాన్యం తగ్గించడం, బ్రెగ్జిట్‌ (ఈయూ నుంచి బ్రిటన్‌ ఎగ్జిట్‌) కంపెనీకి సమస్యలను తెచ్చిపెట్టింది. బ్రెగ్జిట్‌ అన్నది అనుకున్నట్టు లేకపోతే మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుందని, ఉత్పత్తికి కోత విధించాల్సి వస్తుందని కంపెనీ ఈ వారంలోనే హెచ్చరించడం గమనార్హం. లాభాలు పడిపోవడం, 20 శాతం అమ్మకాలు యూరోప్‌ దేశాల్లోనే ఉన్నందున బ్రెగ్జిట్‌ కారణంగా ఎదురయ్యే సమస్యలతో వచ్చే రెండేళ్ల కాలంలో జేఎల్‌ఆర్‌ నగదు ప్రవాహాలు ప్రతికూలంగా ఉంటాయని ఫిచ్‌ అంచనా వేసింది. ఎందుకంటే జేఎల్‌ఆర్‌ ఉత్పత్తుల్లో అధిక శాతం డీజిల్‌ వాహనాలే. యూరోప్‌లో కంపెనీ విక్రయాల్లో 90 శాతం డీజిల్‌ కార్లే. ‘‘వచ్చే రెండేళ్ల కాలంలో నగదు ప్రవాహాలు ప్రతికూలంగా మారతాయన్న అంచనాల ఆధారంగానే కంపెనీ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చడం జరిగింది. 2021 మార్చి నాటికి ఈ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది’’ అని ఫిచ్‌ తన నోట్‌లో తెలిపింది. లాభాలు పడిపోవడం కూడా మరో కారణంగా పేర్కొంది. 



You may be interested

కంపెనీకి సంబంధించి కీలక ఫైనాన్షియల్‌ ఇండికేటర్లు

Saturday 15th September 2018

స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు, ఎవరో ఒకరు సూచించిన వాటిని కొనుగోలు చేయడం కంటే, తమకు తాముగా పరిశోధన చేసి ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అలాగే, అనలిస్టులు సూచించిన స్టాక్స్‌ విషయంలోనూ కీలక ఆర్థిక గణాంకాలను పరిశీలించి ఇన్వెస్ట్‌ చేయాలా, లేదా అన్నది తమకు తాము నిర్ణయించుకోవచ్చు. ఈ విషయంలో ప్రతీ ఒక్క ఇన్వెస్టర్‌ ఓ కంపెనీకి సంబంధించి చూడాల్సిన ముఖ్యమైన ఫైనాన్షియల్‌ ఇండికేటర్లను వ్యాల్యూ

42,000లకు సెన్సెక్స్-మోర్గాన్‌స్టాన్లీ అంచనా

Friday 14th September 2018

ప్రముఖ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టార్గెట్‌ను పెంచింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 42,000 పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.  కాగా మోర్గాన్‌ స్టాన్లీ ఇదివరకు 2019 జూన్‌ నాటికి సెన్సెక్స్‌ 36,000 పాయింట్లకు వెళ్తుందని అంచనా వేసింది. అయితే 2018 జూలైలోనే సెన్సెక్స్‌ ఈ మార్క్‌ను అధిగమించేసింది. ఇండెక్స్‌ ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు దాదాపు 11 శాతంమేర ర్యాలీ చేసింది.

Most from this category