STOCKS

News


అమ్మకానికి తొలి యాపిల్ కంప్యూటర్‌

Thursday 16th May 2019
news_main1557991576.png-25768

  • మే 16న ఆన్‌లైన్‌లో వేలం ప్రారంభం
  • ధర రూ.2.81- 4.56 కోట్ల దాకా అంచనా

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తొలినాళ్లలో తయారు చేసిన కంప్యూటరు అమ్మకానికి వస్తోంది. మే 16 నుంచి 24 దాకా ఆన్‌లైన్‌లో నిర్వహించే వేలంలో క్రిస్టీస్‌ సంస్థ దీన్ని విక్రయిస్తోంది. దీని ధర 4,00,000- 6,50,000 డాలర్ల దాకా (సుమారు రూ. 2.81 కోట్ల నుంచి రూ. 4.56 కోట్ల దాకా) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. 1976లో యాపిల్ తొలి విడతలో తయారు చేసిన 200 యాపిల్‌-1 కంప్యూటర్స్‌లో ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఇప్పుడు వేలానికొచ్చింది. యాపిల్‌ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌, స్టీవ్ వోజ్నియాక్‌ దీన్ని రూపొందించారు. "అప్పట్లో సుమారు 200 యాపిల్‌-1 కంప్యూటర్స్‌ను తయారు చేశారు. 666.66 డాలర్ల ధరకు విక్రయించారు. 1977లో రేటును 475 డాలర్లకు తగ్గించారు. అదే ఏడాది ఆఖరు నాటికి యాపిల్‌-II అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ తర్వాత నుంచి యాపిల్‌-1 అమ్మకాలను నిలిపివేశారు" అని క్రిస్టీస్‌ సంస్థ పేర్కొంది. 1977 అక్టోబర్‌లో యాపిల్‌-1 అమ్మకాలను నిలిపివేసిన తర్వాత వాటిని కొనుక్కున్న వారు తిరిగి ఇస్తే కొంత డిస్కౌంటుతో కొత్త కంప్యూటర్‌ను కొనుగోలు చేసే ఆఫర్లను యాపిల్ ప్రకటించింది. అలా తిరిగొచ్చిన వాటిలో చాలా మటుకు కంప్యూటర్స్‌ ధ్వంసం కాగా.. యాపిల్-1 కంప్యూటర్స్‌లో సుమారు సగం మాత్రమే మిగిలాయి. వీటినే క్రిస్టీస్ ప్రస్తుతం అమ్మకానికి తెస్తోంది. 



You may be interested

‘జెట్‌’ విక్రయంలో కదలిక!

Thursday 16th May 2019

ఎస్బీఐ క్యాప్స్‌తో డార్విన్‌ గ్రూపు భేటీ రూ.14,000 కోట్ల డీల్‌కు ప్రతిపాదన తెరపైకి హిందుజా సోదరులు ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్‌ గ్రూపు బుధవారం ఎస్‌బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్‌ గ్రూపు సీఈవో రాహుల్‌ గన్‌పులే తెలిపారు. ఆయిల్‌ అండ్‌గ్యాస్‌, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్‌ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్‌బీఐ

ఎగసిన వాణిజ్య లోటు

Thursday 16th May 2019

5 నెలల గరిష్టానికి చేరిక  ఏప్రిల్‌లో వృద్ధి 4 నెలల కనిష్ఠం గణనీయంగా తగ్గిన ఎగుమతులు 4.5 శాతం పెరిగిన దిగుమతులు భారీగా చమురు, పసిడి దిగుమతులు న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వజ్రాభరణాలు, లెదర్ ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు గత నెల గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2018 డిసెంబర్‌లో ఎగుమతుల వృద్ధి అత్యల్పంగా 0.34 శాతంగా నమోదైంది. ఫలితంగా

Most from this category