STOCKS

News


18 ఏళ్లు రాగానే తెలుసుకోవాల్సిన ఆర్థిక అంశాలు

Friday 13th July 2018
news_main1531422323.png-18271

తల్లిదండ్రుల్లో కొందరు తమ పిల్లల పేరిట ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. దీంతో వారి మైనర్‌ పిల్లల పేరిట బ్యాంకు ఖాతాలు, పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు ఉంటాయి. అయితే, వారికి 18 ఏళ్లు వచ్చిన వెంటనే వాటికి హక్కుదారులుగా, నిర్వాహకులుగా మారిపోతారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలు మైనారిటీ తీరిన వారి పేరిట ఉన్న పెట్టుబడులను ఫ్రీజ్‌ చేసేస్తాయి. మేజర్‌ అయిన వెంటనే పూర్తి వివరాలతో, డాక్యుమెంట్లతో, తమ సంతకంతో రికార్డులను చట్టబద్ధంగా అప్‌డేట్‌ చేసుకోవాలి. 

 

చట్టం ఏం చెబుతోంది?
మైనర్లు పేపర్లపై సంతకాలు చేయరాదు. అలాగే, ఒప్పందాలు చేసుకోరాదు. లేదా థర్డ్‌పార్టీకి చెక్కులు జారీ చేయకూడదు. 18 ఏళ్లు రాగానే వారు ఈ తరహా లావాదేవీలు చేసుకోవచ్చు. 

 

అప్‌డేట్‌
బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు మేజర్‌ అయిన వారి వివరాలను రికార్డుల్లో అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. మేజర్‌ అయిన వ్యక్తి సంతకం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ పత్రంపై అప్పటి వరకు సంరక్షకుడిగా వ్యవహరించిన వారు కూడా సంతకం చేయాలి. బ్యాంకు ఖాతా ఉన్న వారు కొత్తగా అకౌంట్‌ ఓపెనింగ్‌ ఫామ్‌ను పూర్తి చేసి, కేవైసీ డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. వయసు ధ్రువీకరణకు పుట్టిన తేదీ సర్టిఫికెట్‌, పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్‌ పరిగణనలోకి తీసుకుంటారు. మేజర్‌ అయిన వారు స్వయంగా బ్యాంకులకు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవాలి. 

 

ఇతర మార్పులు
బ్యాంకు ఖాతా ఆపరేషన్‌ మోడ్‌ను కూడా మార్చుకోవాలి. ఈ పత్రం కూడా బ్యాంకులో అడిగి తీసుకోవాలి. అలాగే, నామినేషన్‌ వివరాలు ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. బ్యాంకు రికార్డు‍ల్లో ఇలా వివరాలు మార్చుకున్న తర్వాత, దీని ఆధారంగా మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇతర పెట్టుబడి సాధనాల్లోనూ తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు కేవైసీ, ఇతర నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది.



You may be interested

క్లయింట్ల నుంచి నగదు స్వీకరించొద్దు: సెబీ

Friday 13th July 2018

స్టాక్‌ బ్రోకర్లు తమ క్లయింట్ల నుంచి నగదు స్వీకరించొద్దని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్లయింట్ల నుంచి తమ బ్యాంకు ఖాతాల్లోకి స్టాక్‌ బ్రోకర్లు నగదు తీసుకోకుండా నిషేధించింది. అయితే, ఐపీవో ఆఫర్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు గాను ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో సెబీ ఉంది. అలాగే, లిస్టింగ్‌ ప్రక్రియను కూడా శీఘ్రతరం చేయనుంది. ‘‘ఈ రోజు ఎలక్ట్రానిక్‌ విధానంలో

మిడ్‌క్యాప్స్‌ పతనంలో ఫండ్స్‌ ఎంచుకొన్న షేర్లివి

Friday 13th July 2018

ఈ ఏడాది మిడ్‌క్యాప్‌ సూచీ 18 శాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీ 24 శాతం వరకు పతనమయ్యాయి. దీంతో కొందరు విశ్లేషకులు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ కంటే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ రిస్క్‌, రాబడుల పరంగా నయమంటూ సూచనలు కూడా ఇస్తున్నారు. కానీ, ఇదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు కొన్ని మిడ్‌, స్మాల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు చేయడం విశేషం. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి 1,000 కంపెనీల వాటాదారుల

Most from this category