పండగ వేళ గృహ శోభ!
By Sakshi

సాక్షి, హైదరాబాద్:
పండగ సీజన్ వస్తే చాలు కొత్త బట్టలు, బైక్, కారు ఎలాగో కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకోవటం సహజం. అందుకే డెవలపర్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆఫర్లు, రాయితీలను ప్రకటిస్తుంటారు.
2 నెలల్లో 30,400 గృహాలు..
సాధారణ సమయాల్లో కంటే పండగ సీజన్లలోనే కొత్త నివాస సముదాయాలు, ఓపెన్ ప్లాట్ వెంచర్లు ఎక్కువగా ప్రారంభమవుతుంటాయి కూడా. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అంటే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ ఏడాది జులై, ఆగస్టు రెండు నెలల్లోనే 30,400 గృహాలు ప్రారంభమయ్యాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. ఇందులో ముంబై, బెంగళూరులో అత్యధికంగా ఉన్నాయి. ఎంఎంఆర్‌లో 13,570, బెంగళూరులో 6 వేల గృహాలున్నాయి. ఈ ఏడాది క్యూ1లో కంటే క్యూ2లో ముంబై, బెంగళూరులో 400 గృహాలు ఎక్కువగా ప్రారంభమయ్యాయి.
రూ.40 లక్షల లోపు గృహాలకే డిమాండ్..
కొత్తగా ప్రారంభమైన గృహాల్లోనూ ఎక్కువగా అందుబాటు గృహాలు (అఫడబుల్) విభాగంలోనే ఉన్నాయి. ఏడు ప్రధాన నగరాల్లో జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రారంభమైన మొత్తం యూనిట్లలో 39 శాతం రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలే. రూ.40–80 లక్షల మధ్య ధర ఉన్న మధ్య స్థాయి గృహాల వాటా 34 శాతం వరకుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రుణ వెసలుబాటు వంటి కారణంగా చాలా మంది డెవలపర్లు అందుబాటు గృహాల వైపు ఫోకస్ చేస్తున్నారు.
రెడీగా ఉంటేనే ఓకే..
విభాగాల వారీగా డిమాండ్ ఉన్న గృహాలను పరిశీలిస్తే.. ముందుగా నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌లనే ఎంచుకుంటున్నారు. ఆ తర్వాతే రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లను చూస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల విషయానికొస్తే.. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుల్లో అస్పష్టత కారణంగా ఈ తరహా నిర్మాణాలకు దూరంగా ఉంటున్నారు.
ఆఫర్లతో పాత ప్రాజెక్ట్‌ల్లో అమ్మకాలు..
గత కొన్నేళ్లుగా దేశంలో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాల కంటే అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) క్లియర్పైనే డెవలర్లు దృష్టిసారించారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. రెరాలో కఠినమైన నిర్మాణ గడువు నిబంధనలే ఇందుకు కారణమన్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 7,00,800 యూనిట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని.. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం తక్కువని ఆయన పేర్కొన్నారు. ఇన్వెంటరీ ప్రాజెక్ట్‌ల వైపు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు రాయితీలు, డిస్కౌంట్లు ఇస్తున్నారు. నగదు రాయితీలు ప్రకటిస్తున్నారు. సులువైన పేమెంట్ ఆప్షన్స్, ఉచిత రిజిస్ట్రేషన్, గృహ ప్రవేశం చేసేవారకూ నో ఈఎంఐ, గోల్డ్ కాయిన్స్, ఉచిత గృహోపకరాలు వంటివి ఇస్తున్నారు.
ఈస్ట్ జోన్లో 15 ప్రాజెక్ట్‌ల ప్రారంభం..
ప్రతి ఏడాది లాగానే ఈసారి దసరాను టార్గెట్‌గా చేసుకొని హైదరాబాద్‌లో చాలా మంది డెవలపర్లు కొత్త అపార్ట్మెంట్లు, వెంచర్లకు ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల వాతావరణం నెలకొనడంతో వీఐపీలు, మంత్రులు బిజీగా ఉండి రాలేరు కాబట్టి.. దసరాకి భూమి పూజకు మాత్రమే పరిమితమై.. తర్వాత లాచింగ్స్ కార్యక్రమాలుంటాయని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి తెలిపారు. ఈస్ట్ జోన్లో దసరాకి సుమారు 15 అపార్ట్మెంట్, లే అవుట్ ప్రాజెక్ట్‌లు ప్రారంభంకానున్నాయని ఆయన చెప్పారు. మా కంపెనీ నుంచి (ఏవీ కన్స్ట్రక్షన్స్) మేడిపల్లిలో 2 లక్షల చ.అ.ల్లో మాల్ అండ్ మల్టిప్లెక్స్, పోచారంలో 20 ఎకరాల్లో 200 ప్రీమియం విల్లా ప్రాజెక్ట్, పర్వతాపురంలో 21 ఎకరాల్లో భారీ లే అవుట్‌ను ప్రారంభించనున్నామని తెలిపారు.
You may be interested
జీ ఎంటర్టైన్మెంట్ కొనొచ్చు..
Saturday 13th October 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, ఆనంద్‌రాఠి తాజాగా జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశాయి. ఎందుకో చూద్దాం.. స్టాక్: జీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ: మీడియా ప్రస్తుత ధర: రూ.466 బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టార్గెట్ ప్రైస్: రూ.585 హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్.. జీ ఎంటర్టైన్మెంట్పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్ ధరను రూ.585గా నిర్ణయించింది. జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుత క్వార్టర్లోనూ బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. పీఏటీ
శ్రీశైలం రహదారిలో బూమ్ ఖాయమని పదిహేనేళ్ల క్రితమే ఊహించాం!
Saturday 13th October 2018సాక్షి, హైదరాబాద్: నివాస సముదాయం, ఓపెన్ ప్లాట్! ఏదైనా సరే ప్రాజెక్ట్ ప్రారంభించాలంటే? ఏ నిర్మాణ సంస్థ అయినా సరే చూసేది.. కాస్తా కూస్తో అభివృద్ధి చెందాలి. మౌలిక వసతుల ఏర్పాట్లతో అమ్మకాలకు ఇబ్బంది ఉండదని భావిస్తేనే! కానీ, రాళ్లు రప్పలతో కూడిన నిర్మానుష్య ప్రాంతాన్ని 3,600 ఎకరాల భారీ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసింది ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటి. అదీ పదిహేనేళ్ల క్రితం శ్రీశైలం రహదారిలోని కడ్తాల్‌లో. కారణం.. భవిష్యత్తు అభివృద్ధిని ముందుగానే