STOCKS

News


పెట్రోల్‌లో రెట్టింపు స్థాయికి ఇథనాల్

Saturday 8th December 2018
news_main1544241109.png-22755

న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్‌లో పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 8 శాతానికి చేరే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు మిల్లులకు తక్కువ వడ్డీపై ‍మరింతగా రుణాలు లభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చక్కెర ఉత్పత్తి సంస్థల సమాఖ్య ఐఎస్‌ఎంఏ 84వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుత ఏడాది అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది సెప్టెంబర్ మధ్య కాలాన్ని చక్కెర సీజన్‌గా వ్యవహరిస్తారు. గత నాలుగేళ్లుగా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమ స్థాయి 1-1.5 శాతం నుంచి 4 శాతానికి చేరిందని, 2018-19 సీజన్‌లో ఇది 7-8 శాతానికి చేరగలదని ప్రధాన్ చెప్పారు. 



You may be interested

విదేశీ మారక నిల్వల్లో పెరుగుదల

Saturday 8th December 2018

ముంబై: విదేశీ మారక నిల్వలు నవంబర్‌ 30తో ముగిసిన వారంలో 933 మిలియన్‌ డాలర్ల మేర పెరిగి మొత్తం 393.71 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో నిల్వలు 795 మిలియన్‌ డాలర్ల మేర తగ్గి 392.78 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. విదేశీ మారక నిల్వల్లో అమెరికాయేతర కరెన్సీలు యూరో, పౌండ్‌, యెన్‌ నిల్వలు కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి. బంగారం నిల్వల విలువ 151.8 మిలియన్‌ డాలర్ల

కరెంట్‌ అకౌంట్‌ లోటు భయాలు

Saturday 8th December 2018

ముంబై: దేశంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) భయాలు నెలకొన్నాయి. రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) నమోదయిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే క్యాడ్‌ 2.9 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 19.1 బిలియన్‌ డాలర్లు. రెండవ త్రైమాసికంలో ఇది  15.9 బిలియన్‌ డాలర్లే (జీడీపీలో 2.4 శాతం). గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 6.9 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 1.1శాతం). కాగా ప్రస్తుత ఆర్థిక

Most from this category