STOCKS

News


ఎస్సార్‌స్టీల్‌ ఇక ఆర్సెలర్‌ మిట్టల్‌ దే!

Tuesday 12th February 2019
news_main1549949026.png-24143

  • ఎస్సార్‌ దివాలా కేసుపై నిర్ణయానికి ఎన్‌సీఎల్‌టీకి లైన్‌క్లియర్‌
  • అడ్డంకులను తొలగించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ దివాలా కేసు పురోగతిలో అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తొలగించింది. దీంతో ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ తరఫున దాఖలైన అత్యధిక బిడ్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అహ్మదాబాద్‌ బెంచ్‌ ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. వివరాల్లోకి వెళితే... ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ దాఖలు చేసిన రూ.42,000 కోట్ల అత్యధిక బిడ్డింగ్‌పై ఈ నెల 11వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోవాలని నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎస్‌సీఎల్‌ఏటీ) ఒక ఉత్తర్వు జారీ చేసింది. అయితే దీనిని 28 మంది ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌  వ్యతిరేకించారు. ఎస్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వుకు స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీఎల్‌టీ తమ వాదనలు అందరివీ వేర్వేరుగా రోజూవారీ వినేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. అందరూ కలిసి ఒకే రిప్రజెంటేషన్‌ సమర్పించాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించడం సరికాదని స్పష్టంచేశాయి. అయితే ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేస్తూ, వారి ద్వారా ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్లే దివాలా పక్రియను అడ్డుకుంటున్నట్లు పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంది. 270 రోజుల్లో దివాలా ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికే 571 రోజులు గడిచిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది.  
ఎన్‌సీఎల్‌ఏటీపై ఇక దృష్టి...
కాగా ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్డింగ్‌పై 11వ తేదీలోపు ఎన్‌సీఎల్‌టీ తుది నిర్ణయం ఇవ్వాలని లేదంటే 12వ తేదీన తానే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఎన్‌సీఎల్‌ఏటీ గతంలో రూలింగ్‌ ఇచ్చింది. ఈ గడువు తీరడంతో ఇప్పుడు ఎన్‌సీఎల్‌ఏటీ చర్యలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎస్సార్‌స్టీల్‌ తన రూ.54,388 కోట్ల రుణ పరిష్కార బిడ్డింగ్‌ను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించడంతో దీనిపైనా ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. దీనిపైనా మంగళవారం ఎన్‌సీఎల్‌ఏటీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.



You may be interested

నిఫ్టీ 50 వీక్లీ ఆప్షన్లు షురూ

Tuesday 12th February 2019

సోమవారం నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: పెట్టుబడిదారులు తమ పోర్టిఫోలియో రిస్కును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు.. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మరో అదనపు హెడ్జింగ్ సాధనం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రధాన సూచీలో తాజాగా వారాంత ఆప్షన్లను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రారంభించింది. మూడు నెలలు, త్రైమాసికం, అర్థ సంవత్సరాంత ఆపన్లకు సరసన వీక్లీ ఆప్షన్లు కూడా సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ విక్రం లిమాయే వెల్లడించారు.

కేకేఆర్‌ చేతికి రామ్‌కీ ఎన్విరో

Tuesday 12th February 2019

మెజారిటీ 60 శాతం వాటా కొనుగోలు దీనికోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి ఈ రంగంలో ఇదే అతిపెద్ద డీల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ సేవల సంస్థ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో (ఆర్‌ఈఈఎల్‌) అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కేకేఆర్‌ 60 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇదివరలోనే ఈ మేరకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదరగా... ఈ లావాదేవీ ప్రక్రియ సోమవారం పూర్తయినట్లు

Most from this category