STOCKS

News


మా వృద్ధిలో తెలుగు రాష్ట్రాలు కీలకం

Friday 14th June 2019
news_main1560496611.png-26296

  • క్లయింట్ల సంఖ్య 14%; ఆదాయం 63%
  • ఎడిల్‌వైజ్‌ వెల్త్‌ అడ్వయిజరీ వెల్లడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అధిక నెట్‌వర్త్‌ గల వ్యక్తులకు, ప్రొఫెషనల్స్‌కు వ్యక్తిగత వెల్త్‌ అడ్వయిజరీ సేవలందిస్తున్న ఎడిల్‌వైజ్‌... గత ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో తమ క్లయింట్ల సంఖ్య 14 శాతం మేర పెరిగినట్లు ప్రకిటించింది. మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌కు సంబంధించి ఆధునిక టెక్నాలజీతో సొంత ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశామని, దానివల్లే ఈ వృద్ధి సాధ్యమయిందని కంపెనీ హెడ్‌ రాహుల్‌ జైన్‌ తెలియజేశారు. క్లయింట్లలో 14 శాతం వృద్ధి ఉన్నా... ఆదాయ పరంగా మాత్రం 63.5 శాతం వృద్ధిని సాధించినట్లు ఆయన తెలియజేశారు. గడిచిన రెండేళ్లుగా 35 శాతం చొప్పున కాంపౌండింగ్‌ వృద్ధిని సాధిస్తున్నట్లు చెప్పారు. ఈ వృద్ధిలో హైదరాబాద్‌దే కీలక పాత్రగా పేర్కొన్నారు. ఎడిల్‌వైజ్‌ మొబైల్‌ ట్రేడర్‌గా (ఈఎంటీ) పేర్కొనే తమ మొబైల్‌ యాప్‌ను 10 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, దేశంలో అగ్రస్థానంలోని యాప్‌లలో ఇదొకటని చెప్పారాయన. 



You may be interested

ఆర్‌ క్యాప్‌ షేర్లను వదిలించుకోనున్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌

Friday 14th June 2019

అనిల్‌ అంబాని రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లను ఇప్పటి వరకు కవర్‌ చేస్తూ వస్తున్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌  తాజాగా ఈ షేర్లను వదిలించుకోవటానికి సిద్ధపడింది.  దీనితో షేరును కవర్‌ చేస్తున్న ఏకైక  బ్రోకరేజీ కంపెనీ కూడా ఆర్‌ క్యాప్‌ను వదిలించుకున్నట్లు కానుంది.  పీడబ్యుసీ విరమించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల వలన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ రేటింగ్‌లు, ఆడిటర్‌ విరమణ, ఒత్తిడిలో ఉన్న బ్యాలెన్స్‌ సీట్లు... కారణంగా ఈ సమయంలో

సగం వాటా విక్రయిస్తాం !

Friday 14th June 2019

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ ఆఫర్‌  వాటా విక్రయం ద్వారా రూ.6,900 కోట్లు!  న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో 50 శాతం వాటాను విక్రయించనున్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటరైన వాధ్వాన్‌ కుబుంబం ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ వాటా విక్రయం ద్వారా రూ.6,900 కోట్లు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే, యాజమాన్య బాధ్యతల నుంచి కూడా వైదొలగడానికి కూడా ప్రమోటర్లు సిద్ధంగా ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Most from this category