News


డా.రెడ్డీస్‌ లాభంలో 44 శాతం వృద్ధి

Friday 17th May 2019
news_main1558089220.png-25802

మార్చి త్రైమాసికానికి డా.రెడ్డీస్‌ ల్యాబ్‌ నికరలాభం 44 శాతం పెరిగి రూ. 434.40 కోట్లను చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 302.20 కోట్ల లాభం నమోదు చేసింది. అయితే క్యు3తో పోలిస్తే నికరలాభం 10 శాతం పతనమైంది. క్యు4లో విక్రయాలు గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి రూ. 4016.6 కోట్లకు చేరాయి. ఎబిటా మార్జిన్‌ 2017-18క్యు4లో 16.3 శాతం, 2018-19క్యు3లో 22.5 శాతం ఉండగా, తాజా సమీక్షా త్రైమాసికంలో 22 శాతంగా నమోదయింది.కంపెనీ స్థూల లాభాల మార్జిన్‌ 52.4 శాతంగా నమోదయింది. క్యు3తో పోలిస్తే ఈ మార్జిన్లు 150 బీపీఎస్‌ తగ్గాయి. ఫారెక్స్‌ రేట్‌లో కదలికలు, వ్యాపారమిశ్రమంలో మార్పులు, ఉత్పత్తి తలనొప్పులు, నిల్వ సరుకు ప్రభావం తదితరాల కారణంగా మార్జిన్లు తగ్గాయని కంపెనీ పేర్కొంది. ఏడాది క్రితంతో పోలిస్తే మార్జిన్లు 100 బీపీఎస్‌ మేర తగ్గాయి. ఒక్కో షేరుపై రూ.20 రూపాయల డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు దాదాపు 3 శాతం పతనమై 2725 రూపాయల వద్ద ముగిసింది. 



You may be interested

సెన్సెక్స్‌ లాభం 537 పాయింట్లు

Friday 17th May 2019

11400లపై ముగిసిన నిఫ్టీ  మార్కెట్‌ వారంతపు రోజైన శుక్రవారం భారీ లాభంతో ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, అటో, బ్యాంకింగ్‌, మీడియా, రియల్టీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సూచీలు భారీగా లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ 537 పాయింట్ల లాభంతో 37,930 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల పెరిగి11,407ల వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా రెండో లాభాల ముగింపు. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంకు నిఫ్టీ

వాల్యూ స్టాకులు ఎప్పటికీ విలువైనవే!

Friday 17th May 2019

గత కొన్నేళ్లుగా మార్కెట్లో కొత్త పెట్టుబడులకు స్టాకుల వాల్యూషన్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. చాలా స్టాకుల వాల్యూషన్లు భారీగా పెరగడంతో వీటిలో పెట్టుబడులకు వెనకాడాల్సిన పరిస్థితి ఉంది. దీనికితోడు ఇంత వాల్యూషన్లకు సరిపడా ఎర్నింగ్స్‌ గ్రోత్‌ కానరాకపోవడం కూడా నెగిటివ్‌గా మారింది. దీంతో కేవలం కొన్ని నాణ్యమైన కంపెనీల్లో మాత్రమే మార్చిమార్చి పెట్టుబడులు పెట్టడం కనిపిస్తోంది. ఇలాంటి బడా కంపెనీలే పోర్టుఫోలియోలకు స్థిరత్వాన్నిస్తున్నాయి. కానీ వీటిలో కూడా వాల్యూషన్లు బాగా

Most from this category