News


భారీ పతనాలుండవు!

Monday 14th January 2019
Markets_main1547458095.png-23577

బిఎన్‌పీ పారిబా అంచనా
దేశీయ మార్కెట్లో సమయానుగత దిద్దుబాట్లే తప్ప భారీ పతనాలు ఈ ఏడాది ఉండకపోవచ్చని బీఎన్‌పీ పారిబా ప్రతినిధి అభిజిత్‌ డే అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరాన్ని రెండు భాగాలుగా పరిశీలిస్తే ప్రథమార్ధంలో ట్రేడ్‌వార్‌, ఫెడ్‌ చర్యలు, ఎన్నికల ఫలితాల్లాంటి స్థూల ఆర్థికాంశాలు, ద్వితియార్ధంలో ఎర్నింగ్స్‌ రికవరీ లాంటి సూక్ష్మ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. ఎర్నింగ్స్‌ గ్రోత్‌తో పాటు సంస్కరణల ఫలాలు అందుకునేందుకు తగిన సంసిద్ధత, వినిమయ ఆధారిత ఎకనమిక్‌ రికవరీ, ఉత్పత్తి రంగంలో క్రమానుగత మూలధన వ్యయాల పెరుగుదల, డిజిటల్‌ మార్పులను అందిపుచ్చుకునే నేర్పు అనేవి కంపెనీలను ప్రభావితం చేయగలవని వివరించారు. ఏడాదిలో ఆటుపోట్లున్నా, ఎంపిక చేసిన రంగాల్లోని ఎన‍్నదగిన స్టాకులు మంచి ప్రదర్శన చూపుతాయన్నారు. 
ప్రథమార్ధంలో స్థూల పరిస్థితుల కారణంగా కొంత ఒడిదుడుకులున్నా, ఎర్నింగ్స్‌ రికవరీ కారణంగా ఈక్విటీలు నిలబడతాయని అంచనా వేశారు. అందువల్ల సూచీల్లో భారీ కరెక‌్షన్లు ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్‌ ఆటుపోట్లలో ఉన్నప్పుడు ఆశ, భయం ఆధారిత నిర్ణయాలు తీసుకోవద్దని ఇన్వెస్టర్లకు సూచించారు. ఎప్పుడైనా దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్టాక్‌ సెలక‌్షన్‌ చేసుకోవాలని సలహా ఇచ్చారు. రాబోయే సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ రేట్లను పెంచకపోవచ్చని అభిజిత్‌ అంచనా వేశారు. ఈ ఏడాది తొలి సగమంతా ఆర్‌బీఐ రేట్లను యథాతధంగానే ఉంచే అవకాశాలున్నాయన్నారు. యూఎస్‌ పాలిటిక్స్‌, యూరోజోన్‌ పరిణామాలు, ఫెడ్‌ చర్యలు, ఈసీబీ నిర్ణయాలు.. దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ అడుగులుంటాయని తెలిపారు. 



You may be interested

అవెన్యూ సూపర్‌మార్ట్‌ 11 శాతం డౌన్‌..!

Monday 14th January 2019

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు డిసెంబర్ క్వార్టర్‌(క్యూ 3) ఫలితాలు అంతంత మాత్రంగా నమోదుకావడంతో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు సోమవారం 11 శాతం  పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు రూ.1454.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో క్యూ3 గణాంకాలు అంతంగా మాత్రంగా నమోదయ్యాయి. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలైన జెప్ఫారీస్‌, క్రిడెట్‌ శాష్యూ, ఎడెల్వీజ్‌,

ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఆదుకుంటుంది!

Monday 14th January 2019

ఈక్విటీలపై గ్లోబల్‌ బ్రోకరేజ్‌ల అంచనా దేశీయ ఈక్విటీల్లో వాల్యూషన్లు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి.అయితే స్థూల ఆర్థికాంశాలు , కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ మెరుగుపడడంతో ఈక్విటీలకు ఇబ్బంది ఉండదని విదేశీ బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఈక్విటీలు లాభాల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఎన్నికల వేళ కాస్త ఒడిదుడుకులు కనిపించినా, లాంగ్‌టర్మ్‌లో లాభాలే ఉంటాయని తెలిపాయి. ఇందుకు దారి తీసే కారణాలను వివరించాయి. 1. ఎర్నింగ్స్‌ వృద్ధి: గత కొన్నేళ్లుగా కొంతమేర ఎర్నింగ్స్‌

Most from this category