STOCKS

News


భారత్‌ ఇంకా వర్ధమాన దేశమేమీ కాదు..

Thursday 15th August 2019
Markets_main1565851468.png-27777

  • ఇకపై అక్రమంగా ప్రయోజనాలు తీసుకోనిచ్చేది లేదు
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ఇతర దేశాలపై విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి భారత్‌, చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన 'వర్ధమాన దేశాల' హోదా ముసుగులో భారత్‌, చైనా అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై ఇలాంటివి సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. భారత్‌, చైనాలు ఆసియాలో ప్రస్తుతం ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగాయని.. అవి ఇంకా వర్ధమాన దేశాలేమీ కాదని పేర్కొన్నారు. కానీ వర్ధమాన దేశాలనే హోదాను అడ్డం పెట్టుకుని అమెరికా నుంచి ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాయన్నారు. "డబ్ల్యూటీవో ఇప్పటికీ కొన్ని దేశాలను ఇంకా ఎదుగుతున్న దేశాలుగానే చూస్తోంది. కానీ వాస్తవానికి అవి ఎప్పుడో ఎదిగేశాయి. అన్ని దేశాలూ ఎదుగుతున్నాయి.. ఒక్క అమెరికా తప్ప. ఇకపై మాత్రం అలాంటి దేశాలు అక్రమంగా వర్ధమాన దేశాల హోదాను వాడుకుని అక్రమంగా ప్రయోజనాలు పొందనిచ్చేది లేదు" అని వ్యాఖ్యానించారు. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం .. వర్ధమాన దేశాలకు ఎగుమతిపరమైన సబ్సిడీలు, టారిఫ్‌లపరంగా కొంత వెసులుబాటు తదితర ప్రయోజనాలు లభిస్తాయి.



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టకాలం..

Thursday 15th August 2019

జూన్‌లో మూడేళ్ల కనిష్టానికి రుణ వృద్ధి ఆటో, రియల్టీ తదితర రంగాల్లో డిమాండ్‌ తగ్గడం కారణం కష్టతరంగా మారిన నిధుల సమీకరణ సదరు సంస్థల ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం న్యూఢిల్లీ: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఇటు రుణాలకు డిమాండ్‌ తగ్గి అటు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో జూన్‌ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీల రుణ మంజూరు వృద్ధి రేటు గణనీయంగా క్షీణించి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కనిష్ట స్థాయికి

28 శాతం ఎగసిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లాభం

Thursday 15th August 2019

అనుబంధ కంపెనీల దన్ను  -13 శాతం వృద్ధితో రూ.19,092 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 28 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.14 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.18 కోట్లకు పెరిగిందని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. అనుబంధ కంపెనీలు ​ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ల పనితీరు బాగా ఉండటంతో

Most from this category