STOCKS

News


మీది లక్కీ పోర్ట్‌ఫోలియోనేనా?

Tuesday 16th April 2019
Markets_main1555354557.png-25146

ఈక్విటీల్లో బంపర్‌ రాబడులు ఆశించేవారే ఎక్కువ మంది ఉంటారు. ఈక్విటీ మార్కెట్లో పదేళ్ల పాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసే వారు తప్పకుండా సంపద కూడబెట్టగలరని చరిత్ర చెబుతోంది. కాకపోతే ప్రతీ ఏటా రాబడులు ఒకే విధంగా ఉండవు. అలాగే, సంపద సృష్టి అనేది మీరు ఎప్పుడు మార్కెట్లోకి ప్రవేశించారన్న దానిపైనా ఆధారపడి ఉంటుంది. అలాగే, మార్కెట్‌ టైమింగ్‌ కంటే మార్కెట్లో ఎంత కాలం పాటు ఉన్నారన్నది కూడా కీలకం అవుతుంది. 

 

ఒక ఇన్వెస్టర్‌ 2003లో మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసి 2012 వరకు వేచి ఉన్నాడనుకుందాం... అప్పుడు వారి పంట పండినట్టే. ఎందుకంటే నిఫ్టీ-50 కాంపౌండెడ్‌గా ఏటా 18.3 శాతం చొప్పున ఆ పదేళ్ల పాటు రాబడులను ఇచ్చింది. అదే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే కాంపౌండెడ్‌ రాబడులు 27 శాతం చొప్పున వచ్చేవని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అధ్యయనం వెల్లడించింది. ‘‘ఎక్కువ మొత్తంలో నగదు కలిగి ఉండడం లేదా పెట్టుబడులను వాయిదా వేయడం వంటివి మీ కోసం మీ పొదుపు నిధులు పనిచేసే చర్యలు కావు. రాబడులు కూడా మీరు ఊహించిన దాని కంటే తక్కువే ఉంటాయి’’ అని ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌ జైన్‌ పేర్కొన్నారు. అందుకే మార్కెట్లు మంచి పనితీరు చూపించని సమయంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. 

 

మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రైవేటు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పదేళ్ల కాలానికి సంబంధించి మూడు భిన్న కాలాల ప్రాతిపదికగా రాబడులపై అధ్యయనం చేసింది. ఇన్వెస్టర్లను మూడు సమూహాలుగా... లక్కీ, న్యూట్రల్‌, అన్‌లక్కీ పేరుతో వర్గీకరించింది. 2003-2012 కాలంలో ఇన్వెస్ట్‌ చేసి వారిని లక్కీగా పేర్కొంది. 2003లో రూ.100ను లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేసి, 2012 వరకు వేచి ఉన్న వారు లక్కీ అని, వారి రూ.100 పెట్టుబడి రూ.1,376 అయినట్టు తెలిపింది. ఇక 2005-2014 కాలాన్ని న్యూట్రల్‌గా పేర్కొంది. 2005లో 100 రూపాయిలు ఇన్వెస్ట్‌ చేసి, 2014 వరకు వేచి ఉంటే ఆ మొత్తం రూ.719 అయి ఉండేదని తెలిపింది. ఆ కాలంలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ కాంపౌండెడ్‌గా 20 శాతం రాబడులను ఇ‍చ్చినట్టు తన నివేదికలో పేర్కొంది. ఇక 2008-2017 కాలాన్ని అన్‌లక్కీ, స్మార్ట్‌గా అభివర్ణించింది. 2008 నుంచి 2017లోపు రూ.100 ఇ‍న్వెస్ట్‌ చేసి 2017 చివరి వరకు వేచి ఉన్న వారికి రూ.100 పెట్టుబడి రూ.686 అయి ఉండేదని, కాంపౌండెడ్‌ రాబడులు 13 శాతమని తెలిపింది. 



You may be interested

మంగ‌ళ‌వారం వార్త‌ల్లోని షేర్లు

Tuesday 16th April 2019

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్ర‌భావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు జెట్ ఎయిర్‌వేస్‌:-  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కంపెనీకి మ‌ధ్యంత‌ర నిధుల జారీకి రుణదాత‌లు అంగీక‌రించే అవ‌కాశం లేదు. ప్రెస్టేజ్ఎస్టేట్స్‌:-  త‌న అనుబంధ సంస్థ ద్వారా బాబిజీ రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మిగిలిన 51శాతం వాటాను రూ.316 కోట్ల‌కు కొనుగోలు చేసినట్లు ఎక్చ్సేంజ్‌ల‌కు స‌మాచారం ఇచ్చింది.  సిండికేట్ బ్యాంక్‌:- అన్ని ఎంసీఎల్ఆర్(మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు) రేట్ల‌పై 5 బేసిస్ పాయింట్ల‌ను త‌గ్గించింది.  ల‌క్ష్మి విలాస్ బ్యాంక్‌:-

సీమెన్స్‌, థర్మాక్స్‌, భెల్‌పై మేనేజర్ల మక్కువ

Tuesday 16th April 2019

మార్చి నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు ప్రత్యేకంగా కొన్ని షేర్లపై మక్కువ చూపించారు. క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం, ఆర్డర్ల రాక మెరుగుపడడం ఈ రంగం పట్ల సానుకూతలకు కారణం. ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉండడం కూడా వీటిల్లో  పెట్టుబడులకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం.    సీమెన్స్‌ కంపెనీలో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ మార్చి నెలలో ఇన్వెస్ట్‌ చేసింది. మూలధన వ్యయాలు రికవరీతో ఈ కంపెనీ లాభపడుతుందని

Most from this category