STOCKS

News


నష్టాల్లోంచి.. లాభాల్లోకి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Thursday 14th February 2019
Markets_main1550137035.png-24199

దీవాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పోరేష‌న్ (డీహెచ్ఎఫ్ఎల్‌) షేరు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లోంచి భారీ లాభాల్లోకి మళ్లింది. జాయింట్‌ ఎండీ, సీఈవో పదవులకు రాజీనామా చేశారనే వార్తలతో నేడు డీహెచ్ఎఫ్ఎల్‌ షేరు 5శాతం నష్టంతో రూ.105.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇం‍ట్రాడేలో మరొక శాతం(మొత్తం 6శాతం) క్షీణించి రూ.104.00ల కనిష్టానికి చేరుకుంది. కంపెనీ బోర్డు హర్షిల్‌ రాజీనామాకు వెంటనే ఆమోదం తెలిపినట్లు వార్తలు తెరపైకి రావడంతో షేరు తిరిగి లాభాల్లోకి మళ్లింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతు తెలపడంతో 19శాతం లాభపడి రూ.131.15వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు (రూ.110.55)తో పోలిస్తే 15.50శాతం నష్టంతో రూ.127.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది, కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 97.00  రూ.690.00లుగా ఉన్నాయి.  ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో దివాన్‌ హౌసింగ్‌ నికర లాభం 37 శాతం క్షీణించి రూ. 314 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం పుంజుకుని రూ. 3256 కోట్లకు చేరింది.



You may be interested

ఎన్నికల భయంతో ఇండియాకు దూరం..

Thursday 14th February 2019

దేశీయ ఈక్విటీలపై ఆసక్తి చూపని విదేశీ ఫండ్ మేనేజర్లు ఈ ఏడాది వర్ధమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే ఇండియా ఈక్విటీలు నీరస ప్రదర్శన చేశాయి. త్వరలో సాధారణ ఎన్నికలు జరుతున్న సమయాన దేశీయ ఈక్విటీలపై ఫండ్‌ మేనేజర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో భారత మార్కెట్లు దూసుకుపోలేకపోతున్నాయి. ఇదే సమయంలో విదేశీ ఫండ్‌ మేనేజర్లు ఇతర వర్ధమాన మార్కెట్లపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. ఈ ఏడాదిలో ఇంతవరకు నిఫ్టీ 0.63 శాతం నష్టపోగా,

యస్‌ బ్యాంకును ‘నో’ అనుకున్నాం..

Thursday 14th February 2019

బ్రోకరేజ్‌ల అభిప్రాయం దాదాపు 14 సంవత్సరాల తర్వాత యస్‌ బ్యాంకు షేరు అత్యధిక ఇంట్రాడే లాభాలు చవిచూసింది. ఒకదశలో దాదాపు 30 శాతం వరకు షేరు దూసుకుపోయింది. బ్యాంకు అసెట్స్‌ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న వార్తలు షేరు కౌంటర్లో జోరు నింపాయి. దీంతో ఇప్పటివరకు షేరుపై నెగిటివ్‌ భావనతో ఉన్న బ్రోకింగ్‌ సంస్థలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. యస్‌బ్యాంకును తప్పుగా అర్ధం చేసుకున్నామని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో షేరు

Most from this category