STOCKS

News


సగం వాటా విక్రయిస్తాం !

Friday 14th June 2019
news_main1560496360.png-26295

  • డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ ఆఫర్‌ 
  • వాటా విక్రయం ద్వారా రూ.6,900 కోట్లు! 

న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో 50 శాతం వాటాను విక్రయించనున్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటరైన వాధ్వాన్‌ కుబుంబం ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ వాటా విక్రయం ద్వారా రూ.6,900 కోట్లు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే, యాజమాన్య బాధ్యతల నుంచి కూడా వైదొలగడానికి కూడా ప్రమోటర్లు సిద్ధంగా ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటరైన వాధ్వాన్‌ కుబుంబానికి ఆ కంపెనీలో దాదాపు 40 శాతం వాటా ఉండొచ్చని అంచనా. 

ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు-లోన్‌ స్టార్‌, ఏఐఓఎన్‌ క్యాపిటల్‌, కేకేఆర్‌ సంస్థలు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌  ఖాతా పుస్తకాల, ఆర్థికాంశాల  మదింపు నిర్వహిస్తున్నాయని, ఈ మదింపు ఫలితాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటాయని సమాచారం. ఈ డీల్‌ సాకారమైతే, కంపెనీ రుణ భారం భారీగా తగ్గుతుందని, పూర్తి స్థాయిలో తిరిగి వ్యాపారం నిర్వహించే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై వ్యాఖ్యానించడానికి కంపెనీ నిరాకరించింది. మరోవైపు తమ జీవిత బీమా విభాగాన్ని కూడా విక్రయించాలని ఈ గ్రూప్‌ భావిస్తోంది. దీని కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను నియమించింది. 

గత ముప్ఫై ఏళ్లుగా దిగువ, మధ్య ఆదాయ వర్గాల వారికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గృహరుణాలందిస్తోంది. ఈ కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ. లక్ష కోట్లకు పైగానే ఉన్నాయి. 



You may be interested

మా వృద్ధిలో తెలుగు రాష్ట్రాలు కీలకం

Friday 14th June 2019

క్లయింట్ల సంఖ్య 14%; ఆదాయం 63% ఎడిల్‌వైజ్‌ వెల్త్‌ అడ్వయిజరీ వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అధిక నెట్‌వర్త్‌ గల వ్యక్తులకు, ప్రొఫెషనల్స్‌కు వ్యక్తిగత వెల్త్‌ అడ్వయిజరీ సేవలందిస్తున్న ఎడిల్‌వైజ్‌... గత ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో తమ క్లయింట్ల సంఖ్య 14 శాతం మేర పెరిగినట్లు ప్రకిటించింది. మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌కు సంబంధించి ఆధునిక టెక్నాలజీతో సొంత ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశామని, దానివల్లే ఈ వృద్ధి సాధ్యమయిందని కంపెనీ హెడ్‌ రాహుల్‌

రేటింగ్‌ ఏజెన్సీలకు సెబీ కఠిన నిబంధనలు

Friday 14th June 2019

ఎగవేతలపై ముందుగానే అప్రమత్తతకు వీలు న్యూఢిల్లీ: క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలకు సంబంధించి కఠిన నిబంధనలను సెబీ తీసుకొచ్చింది. పలు ఇనుస్ట్రుమెంట్ల డిఫాల్ట్‌ అవకాశాలను రేటింగ్‌ ఏజెన్సీలు ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. రుణాల చెల్లింపుల్లో పలు కంపెనీలు విఫలమవుతున్న ఘటనలు పెరిగిపోవడంతో సెబీ కఠిన నిబంధనలు తీసుకొచ్చినట్టయింది. సెబీతో సంప్రదింపుల అనంతరం క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ప్రతీ రేటింగ్‌ విభాగంలో డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలపై ఓ ప్రామాణిక ఏకీకృత బెంచ్‌ మార్క్‌ ప్రమాణాలను

Most from this category