STOCKS

News


అక్టోబర్‌ నుంచి డీబీఎస్‌ బ్యాంక్‌ సేవలు!!

Friday 13th July 2018
news_main1531503199.png-18300

సింగపూర్‌: సింగపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీబీఎస్‌ గ్రూప్‌.. భారత్‌లో బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించడానికి సిద్ధమౌతోంది. తమకు పూర్తి అనుబంధ సంస్థగా ‘డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా’ను (డీబీఎస్‌ ఇండియా) ఏర్పాటు చేయడానికి త్వరలో తుది ఆమోదం రానుందని, దీని ద్వారా బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి, అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పీయుష్‌ గుప్తా తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన డీబీఎస్‌ ఆసియా 2018 సదస్సులో మాట్లాడారు. ‘ప్రస్తుతం మేం 13 పట్టణాల్లో కార్యాలయాలను కలిగి ఉన్నాం. వచ్చే 12-18 నెలల కాలంలో ఈ సంఖ్యను 30కి తీసుకెళ్లడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. కాగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2017 సెప్టెంబర్‌లోనే డీబీఎస్‌ గ్రూప్‌కు తన ప్రస్తుత ఇండియా ఫ్రాంచేజీలను పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మార్చుకోవడానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. డీబీఎస్‌ గ్రూప్‌ అనేది ఆసియాలోని టాప్‌-3 ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థల్లో ఒకటి.  


DBS

You may be interested

ఖరీదైన ఆభరణాలు కొన్న వారి రిటర్నులు మళ్లీ మదింపు

Friday 13th July 2018

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సంస్థల నుంచి ఖరీదైన ఆభరణాలు కొన్న 50 మందికి పైగా అధిక విలువ కలిగిన వ్యక్తుల రిటర్నులను... మరోసారి తిరిగి మదింపు చేయాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. పీఎన్‌బీని రూ.13,000 కోట్లకు మోసగించి నీరవ్‌ మోదీ విదేశాలకు పరారైన విషయం తెలిసిందే. ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఉన్న ఆదాయ మార్గాలను తెలియజేయాలని నోటీసులు పంపినా గానీ... చాలా మంది

అమెరికన్ సంస్థలతో స్పైస్‌జెట్ జట్టు

Friday 13th July 2018

 వాషింగ్టన్:  కార్యకలాపాల విస్తరణలో భాగంగా రెండు అమెరికన్ సంస్థలతో భారీ వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ఆయా కంపెనీల పేర్లు వెల్లడించనప్పటికీ.. ఇందులో ఒకటి పెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థ కాగా, మరొకటి దిగ్గజ అమెరికన్ సంస్థని పేర్కొన్నారు. ఏవియేషన్ వ్యాపారం అధిక రిస్కుతో కూడుకున్నది కావడంతో ఇతరత్రా అనుబంధ వ్యాపార విభాగాలవైపు కూడా

Most from this category