STOCKS

News


6 శాతం తగ్గిన సైయంట్‌ లాభం

Thursday 12th July 2018
news_main1531410650.png-18259

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: 2018-19 ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ సేవల కంపెనీ సైయంట్‌ నికరలాభం క్షీణించింది. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 6.42 శాతం తగ్గింది. ఈ కాలంలో నికరలాభం రూ.87.8 కోట్ల నుంచి రూ.82.5 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు మాత్రం రూ.944 కోట్ల నుంచి రూ.1,097 కోట్లకు ఎగసింది. 2017-18 జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టరులో యుటిలిటీస్‌, జియోస్పేషియల్‌, కమ్యూనికేషన్స్‌ విభాగం ఆదాయం రూ.342 కోట్ల నుంచి దాదాపు 12 శాతానికి పైగా పెరిగి రూ.385 కోట్లను తాకింది. మాన్యుఫ్యాక్చరింగ్‌, ఇండస్ట్రియల్‌ విభాగం ఆదాయం రూ.489 కోట్ల నుంచి రూ.574 కోట్లకు చేరింది. డిజైన్ ఆధారిత మాన్యుఫ్యాక్చరింగ్‌ నుంచి ఆదాయం రూ.76 కోట్ల నుంచి రూ.121 కోట్లకు ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని సైయంట్‌ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు.



You may be interested

మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌:ఇంటెక్స్‌

Thursday 12th July 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీలో ఉన్న ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ ఇకపై మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ధరల శ్రేణి రూ.7 వేల లోపే ఉంటుందని కంపెనీ మొబైల్స్‌ ప్రొడక్ట్‌ హెడ్‌ ఇషిత బన్సల్‌ తెలిపారు. ఇన్ఫీ సిరీస్‌లో 18:9 ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే ప్యానెల్‌తో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌గా ఇన్ఫీ కొనసాగుతుందని చెప్పారు.

షాపింగ్‌ మాలే ఆఫీసు!

Thursday 12th July 2018

 స్టార్‌ హోటళ్లలోనూ కార్యాలయాలు  20 లక్షల చ.అ.లకు కో–వర్కింగ్‌ స్పేస్‌  బెంగళూరు, ఎన్‌సీఆర్, హైదరాబాద్‌ల్లోనే డిమాండ్‌  హైదరాబాద్‌ మెట్రో మాల్స్‌లోనూ కో-వర్కింగ్‌ స్పే్‌స్‌? హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మాల్స్, స్టార్‌ హోటల్స్‌.. ఇపుడివి తినడానికో లేదా షాపింగ్‌ చేయడానికో మాత్రమే కాదు!! ఆఫీసులుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్‌ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు... ఇప్పుడు షాపింగ్‌ మాల్స్, స్టార్‌ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్‌ వసతులూ

Most from this category