STOCKS

News


2 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓ

Saturday 11th August 2018
Markets_main1533957867.png-19165

న్యూఢిల్లీ: ​‍క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 2.22 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. శుక్రవారం ముగిసిన ఈ  ఐపీఓ సైజు రూ.1,131 కోట్లు. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.418-422ను కంపెనీ నిర్ణయించింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల వాటా 5.5 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 88 శౠతం చొప్పున సబ్‌స్క్రైబయ్యాయి. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 23న స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయని అంచనా. ఇటీవలనే ఈ 
సూక్ష్మ రుణ సంస్థ, యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా రూ.339 కోట్లు సమీకరించింది. 



You may be interested

ఇక రుణదాతలుగా గృహ కొనుగోలుదారులు

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారులు ఇకపై సంబంధిత ప్రాజెక్టుకు సంబంధించి రుణ దాతల హోదా పొందనున్నారు. ఈ మేరకు పార్లమెంటు శుక్రవారం ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ (ఐబీసీ) 2016కు సవరణను ఆమోదించింది. గృహ ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకే రుణ దాత హోదా ఉంది. ఈ బిల్లుకు లోక్‌సభ జూలై 31వ తేదీనే ఆమోదముద్ర వేసింది. తాజాగా రాజ్యసభ కూడా ఓకే చెప్పడంతో  సవరణ బిల్లుకు  పార్లమెంటు

జెట్ ఎయిర్‌వేస్‌ పరిణామాలపై కేంద్రం దృష్టి

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌పై కేంద్రం దృష్టి సారించింది. కంపెనీ పరిణామాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. అయితే, కంపెనీ ఆర్థిక ఆడిటింగ్‌ను నిర్వహించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడాన్ని కూడా జెట్ ఎయిర్‌వేస్ వాయిదా వేసిన నేపథ్యంలో చౌబే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధారణంగా విమానయాన

Most from this category