News


పదేళ్లలో నిఫ్టీ రాబడి 150 శాతం

Wednesday 17th April 2019
Markets_main1555493636.png-25188

విదేశీ ఇన్వెస్టర్లకు డాలరు రూపేణా రాబడులిచ్చిన ప్రపంచ టాప్‌ 20 సూచీల్లో నిఫ్టీ అత్యుత్తమ ప్రదర్శన కనపర్చింది. ఏ కాలపట్టికతో పోల్చినా నిఫ్టీ ర్యాంకింగ్‌ 5 దిగువకు తగ్గకపోవడం విశేషం. ఒక ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్లు కాలంలో వరుసగా 6 శాతం, 42 శాతం, 53 శాతం, 150 శాతం చొప్పున నిఫ్టీ కంపెనీల్లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు లాభాల్ని అందుకున్నారు. అమెరికాలోని డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ సూచితోపాటు స్థిర రాబడుల్ని అందించింది నిఫ్టీనే. గత ఏడాదికాలంగా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బాగా క్షీణించినప్పటికీ, డాలరు ప్రాతిపదికన నిఫ్టీ లాభాలందించడం గమనార్హం. 



You may be interested

ఆటో, మెటల్‌ షేర్లు పెరగొచ్చు

Wednesday 17th April 2019

ప్రధాన సూచి నిఫ్టీ బ్రేక్‌అవుట్‌ అయిన నేపథ్యంలో స్వల్పకాలిక చార్టుల్లో ఆటో, మెటల్‌ షేర్లు పటిష్టంగా కన్పిస్తున్నాయని, తగిన స్టాప్‌లాస్‌తో ఈ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్‌ షేర్లలో పొజిషన్లు తీసుకోవొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ డెరివేటివ్‌ అనలిస్ట్‌ వినయ్‌ రజని సూచించారు. నిఫ్టీ 11,760 పాయింట్ల ఎగువన 12,000 పాయింట్ల స్థాయికి చేరే ఛాన్స్‌ వుందని, అయితే సూచీ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్వల్పకాలంలో కొన్ని షేర్లు పెరగవచ్చని, వాటిలో ఆటో, మెటల్‌ షేర్లు

విప్రో ఏడీఆర్‌ 3.4 శాతం డౌన్‌

Wednesday 17th April 2019

  రూ. 10,000 కోట్ల విలువైన బైబ్యాక్‌ ప్రకటించినప్పటికీ, ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడంతో మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో విప్రో అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఈ ఏడీఆర్‌ 4.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల ఆదాయ వృద్ధి 7–8 శాతం మేర వుండగా, విప్రో ఆదాయం 4 శాతమే పెరగడం విశ్లేషకుల్ని నిరాశపర్చింది. రూ. 325 ధరతో

Most from this category