STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాలు

Tuesday 12th February 2019
news_main1549953667.png-24154

  • అమరరాజా లాభం రూ.129 కోట్లు

డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో అమరరాజా నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.134 కోట్ల నుంచి రూ.129 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,570 కోట్ల నుంచి రూ.1,707 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.5,267 కోట్ల టర్నోవరుపై రూ.363 కోట్ల నికరలాభం ఆర్జించింది.

  • హెచ్‌బీఎల్‌ పవర్‌ లాభం రూ.7.3 కోట్లు..

క్యూ3లో హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.7.3 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.417 కోట్ల నుంచి రూ.314 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్‌-డిసెంబరులో రూ.958 కోట్ల టర్నోవరుపై రూ.18 కోట్ల నికరలాభం సాధించింది.
 

  • రెండింతలైన ఆంధ్రా సిమెంట్స్‌ నష్టాలు..

గడిచిన త్రైమాసికంలో ఆంధ్రా సిమెంట్స్‌ నష్టం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా పెరిగి రూ.79 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.114 కోట్ల నుంచి రూ.75 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.247 కోట్ల టర్నోవరుపై రూ.146 నష్టం నమోదైంది.

  • ఐషర్‌ మోటార్స్‌ లాభం అంతంతమాత్రమే !

న్యూఢిల్లీ: ఐషర్‌ మోటార్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో స్వల్పంగానే పెరిగింది. గత క్యూ3లో రూ.521 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 2 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు పెరిగిందని ఐషర్‌ మోటార్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,316 కోట్ల నుంచి రూ.2,488 కోట్లకు చేరుకుంది. టూ వీలర్ల విభాగం, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఆదాయం రూ.2,269 కోట్ల నుంచి 3 శాతమే పెరిగి రూ.2,341 కోట్లకు పెరిగిందని ఐషర్‌ మోటార్స్‌ డైరెక్టర్‌, సీఈఓ సిద్ధార్థ లాల్‌ తెలిపారు.
6 శాతం తగ్గిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు
గత క్యూ3లో 2.02 లక్షలుగా ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు ఈ క్యూ3లో 1.93 లక్షలకు తగ్గాయని సిద్ధార్థ లాల్‌  వెల్లడించారు. వాణిజ్య వాహన అమ్మకాల కంపెనీ వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ (వీఈ సీవీ) ఆదాయం రూ.2,590 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.2,818 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపారు.

ప్రీమియమ్‌ బైక్‌ అమ్మకాలు పెరుగుతాయ్‌...

గత  ఏడాది చివరి ఆరు నెలలు టూవీలర్‌ మార్కెట్‌కు గడ్డుకాలమని లాల్‌ వ్యాఖ్యానించారు. బీమా వ్యయాలు పెరగడం, ముడి పదార్ధాలు ధరలు అధికం కావడం, ప్రభుత్వ నిబంధనల కారణంగా భద్రతా ప్రమాణాల పెంపు కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడం... తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపించాయన్నారు. ఖరీదైన బైక్‌ల అమ్మకాలు పెరగడం భవిష్యత్తులో కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు.



You may be interested

స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ కొనొచ్చు!

Tuesday 12th February 2019

మోర్గాన్‌స్టాన్లీ సూచన చిన్న, మధ్యతరహా స్టాక్స్‌ను కొనుగోలు చేసే సమయం వచ్చిందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడుతోంది. ప్రధాన సూచీలతో పోలిస్తే చిన్న స్టాకులు చూసిన కరెక‌్షన్‌ దృష్టితో చూస్తే వీటిని ఇక కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇకమీదట సూచీలు క్రమానుగత రికవరీ చూపుతాయని, ముఖ్యంగా ప్రధాన సూచీలకు స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలకు మధ్యకల వ్యత్యాసం క్రమంగా తగ్గుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈవ్యత్యాసం ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు దగ్గరగా ఉందని

47 స్టాకుల్లో ఎంఏసీడీ నెగిటివ్‌ సంకేతాలు

Tuesday 12th February 2019

సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో నిఫ్టీ 10900 పాయింట్ల దిగువకు చేరింది. సోమవారం ముగింపు చార్టుల్లో 47 స్టాకుల్లో ఎంఏసీడీ ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు వెలువరిస్తోంది. ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు

Most from this category