STOCKS

News


కోల్‌ ఇండియా లాభం రూ.4,567 కోట్లు

Wednesday 13th February 2019
news_main1550038358.png-24166

  • 50 శాతం వృద్ధి 
  • రూ.26,209 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: 
కోల్‌ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో ​‍త్రైమాసిక కాలంలో 50 శాతం ఎగసింది. గత క్యూ3లో రూ.3,043 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.4,567 కోట్లకు పెరిగిందని కోల్‌ ఇండియా తెలిపింది. బొగ్గు ఉత్పత్తి అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది.  విశ్లేషకులు ఈ కంపెనీ రూ.4,069 కోట్ల నికర లాభం సాధించగలదని అంచనా వేశారు. ఈ అంచనాలను మించిన లాభాన్ని ఈ కంపెనీ సాధించింది. 
ఎబిటా 55 శాతం అప్‌...
గత క్యూ3లో రూ.22,821 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.26,209 కోట్లకు పెరిగిందని కోల్‌ ఇండియా పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.18,173 కోట్ల నుంచి రూ.19,181 కోట్లకు పెరిగాయని వివరించింది. ఎబిటా 55 శాతం ఎగసి రూ.6,788 కోట్లకు పెరిగిందని, ఎబిటా మార్జిన్‌ 6.9 శాతం పెరిగి 27.1 శాతానికి చేరిందని తెలిపింది. ఈ క్యూ3లో  బొగ్గు ఉత్పత్తి 2.6 శాతం పెరిగి 155.97 మిలియన్‌ టన్నులకు చేరిందని పేర్కొంది. ఇక ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలానికి బొగ్గు ఉత్పత్తి 7 శాతం పెరిగి 412.5 మిలియన​ టన్నులకు చేరిందని తెలిపింది. ఇంధన సరఫరా ఒప్పంద రియలైజేషన్‌ ఒక్కో టన్నుకు రూ.1,334 గా ఉందని, ఈ-ఆక్షన్‌ రియలైజేషన్‌ టన్నుకు రూ.2,847గా ఉందని పేర్కొంది. ఈ-ఆక్షన్‌ వాల్యూమ్స్‌ 14.65 మిలయన్‌ టన్నులని వివరించింది.You may be interested

ఏంజల్‌ బ్రోకింగ్‌ స్ట్రాంగ్‌ బెట్స్‌

Wednesday 13th February 2019

దీర్ఘకాలంలో బలమైన రాబడులు(రిటర్న్‌ పొటెన్షియల్‌) అందించే సత్తా ఉన్న స్టాకులను ఏంజల్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది. ఆయా స్టాకులు ఎంత శాతం అప్‌మూవ్‌ జరపగలవో అంచనాలు వేస్తోంది.  1. జేఎస్‌పీఎల్‌: 91 శాతం అప్‌సైడ్‌. గత ఐదేళ్లో ముడి స్టీల్‌ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసుకుంది. ప్రస్తుతం ఉన్న సామర్ధ్యంలో 50 శాతం వినియోగంలో ఉంది. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.  2. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌: 86 శాతం అప్‌సైడ్‌. ఎస్‌ఓటీపీ వాల్యూషన్ల ప్రకారం

మరోదఫా రేటు కోత చాన్స్‌...!

Wednesday 13th February 2019

సానుకూల ఆర్థిక గణాంకాలు 19 నెలల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో కేవలం 2.05 శాతం మందగమనంలో పారిశ్రామికం డిసెంబర్‌లో కేవలం 2.4 శాతం వృద్ధి  న్యూఢిల్లీ:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరో దఫా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం)కు తగిన ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో  కేవలం 2.05 శాతంగా నమోదయ్యింది. గడచిన 19 నెలల్లో ఇంత

Most from this category