STOCKS

News


స్టీల్‌ షేర్లకు సిటీ షాక్‌

Friday 7th December 2018
Markets_main1544172179.png-22733

గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ సిటీ తాజాగా దేశీ స్టీల్‌ కంపెనీలకు గట్టి షాకిచ్చింది. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. స్టీల్‌ ధరలు పడిపోవడం, రుణ భారం పెరుగుదల, అధిక వ్యాల్యుయేషన్స్‌ వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. దీంతో ఇండియన్‌ స్టీల్‌ కంపెనీలు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడం లేదని తెలిపింది. 
టాటా స్టీల్‌ స్టాక్‌ను విక్రయించొచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.620 నుంచి రూ.440కి తగ్గించింది. సెయిల్‌ షేరు కూడా విక్రయించొచ్చని తెలిపింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.72 నుంచి రూ.40కి తగ్గించేసింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్టాక్‌ను కూడా విక్రయించొచ్చని పేర్కొంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.410 నుంచి రూ.290కి తగ్గించేసింది. చైనా డిమాండ్‌ మందగిస్తే 2019లో స్టీల్‌ ధరలు సాధరణ స్థాయికి రావొచ్చని అంచనా వేసింది. 

సిటీ డౌన్‌గ్రేడ్‌ నేపథ్యంలో మధ్యాహ్నం 2:05 సమయంలో.. టాటా స్టీల్‌ 1 శాతం క్షీణతతో రూ.506 వద్ద, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.26 శాతం క్షీణతతో రూ.301 వద్ద, సెయిల్‌ 4 శాతం క్షీణతతో రూ.51 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 0.74 శాతం క్షీణతతో 3,062 పాయింట్ల వద్ద ఉంది. 



You may be interested

స్టీల్‌ షేర్ల పతనం: కళ తప్పిన మెటల్‌ షేర్లు

Friday 7th December 2018

స్టీల్‌ షేర్ల పతనంతో శుక్రవారం మెటల్‌ షేర్లు కళతప్పాయి. ప్రముఖ రేటింగ్‌ సం‍స్థ సిటీ దేశీ స్టీల్‌ కంపెనీలకు డౌన్‌గ్రేడ్‌ రేటింగ్‌ను కేటాయించడంతో స్టీల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. స్టీల్‌ షేర్ల ధరలు అధిక వ్యాల్యూవేషన్స్‌ వద్ద ట్రేడ్‌ అవుతుండటం, ఆయా ఆయా కంపెనీలకు రుణ భారం పెరుగుదల,  అధిక వ్యాల్యుయేషన్స్‌ తదితర కారణాలతో గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ సిటీ తాజాగా స్టీల్‌ షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌

తగ్గినపుడు కొనడమే సరైన వ్యూహం..!

Friday 7th December 2018

ముంబై:  మార్కెట్‌ను చూసి ఏమాత్రం భయపడవద్దని, భారత మార్కెట్‌ పట్ల బుల్లిష్‌గా ఉండడం సరైన నిర్ణయమని బీఎస్‌ఈ సభ్యుడు రమేష్ దమానీ సూచించారు. అవకాశాలు ఉన్నప్పుడే మార్కెట్‌లో పెట్టుబడులు మంచిదని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మార్కెట్‌ మాయాజాలాన్ని యువకులు అర్థం చేసుకుని ఓర్పుగా ఉండాలని సూచించిన ఈయన.. ఇలా వేచి ఉండడం వల్ల దీర్ఘకాలంలో భారీ మొత్తంలో సంపదను పొందవచ్చని వివరించారు. ఇందుకు బుల్లిష్‌గా

Most from this category