STOCKS

News


సిప్లా చేతికి దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ

Thursday 12th July 2018
news_main1531412153.png-18267

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నది. ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్‌ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్‌లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్‌ లిమిటెడ్‌ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్‌ప్రో సౌత్‌ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది. ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా కాంపిటీషన్‌ కమిషన్ ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా ఈ డీల్‌ పూర్తవుతుందని పేర్కొంది. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే మిర్రెన్‌ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగిసే ఏడాదికి 15.21 కోట్ల​దక్షిణాఫ్రికా రాండ్‌ల టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ కొనుగోలు వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో సిప్లా షేర్‌ 1.2 శాతం లాభంతో రూ.632 వద్ద ముగిసింది. 
 



You may be interested

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ.4,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌

Thursday 12th July 2018

ముంబై: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రూ.4,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.1,100 ధరకు మొత్తం 3.63 కోట్ల షేర్లను(మొత్తం షేర్లలో ఈ షేర్లు 2.61 శాతం వాటాకు సమానం) బైబ్యాక్‌ చేయడానికి తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. గురువారం బీఎస్‌ఈలో ఈ షేర్‌ 1 శాతం లాభంతో రూ.1,005 వద్ద ముగిసింది. ఈ

ఏడు నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం- ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మే నెలలో పేలవ పనితీరును ప్రదర్శించింది. కేవలం 3.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గత ఏడాది మే నెలలో వృద్ధి 2.9 శాతమే కావడం గమనార్హం. తయారీ, విద్యుత్‌ రంగాల పేలవ పనితీరును పదర్శించాయి. కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలనూ చూస్తే (ఏప్రిల్‌,

Most from this category