STOCKS

News


సెంట్రమ్‌ స్టాక్‌ సిఫార్సులు..

Saturday 10th November 2018
Markets_main1541838705.png-21869

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..

సన్‌ టీవీ నెట్‌వర్క్‌: కొనొచ్చు
సన్‌ టీవీ నెట్‌వర్క్‌ స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,170 నుంచి రూ.1,060కి (ప్రస్తుత ధర రూ.623) తగ్గిస్తున్నాం. ‍ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో అడ్వర్టైజింగ్‌ రెవెన్యూలో వృద్ధి నిరుత్సాహకరంగా ఉంది. అయితే రెండో అర్ధ భాగంలో వృద్ధి బాగుంటుందని అంచనా వేస్తున్నాం. పండుగ సీజన్‌, కొత్త చానళ్ల ఆవిష్కరణ వంటివి ఇందుకు దోహదపడొచ్చు. డిజిటైజేషన్‌ వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. మూవీ ప్రొడక‌్షన్‌ వ్యాపారంలో ఇన్వెస్ట్‌మెంట్లు, ఐపీఎల్‌లో టర్న్‌అరౌండ్‌ వంటివి సానుకూల అంశాలు.

యాక్సిస్‌ బ్యాంక్‌: హోల్డ్‌ చేయొచ్చు
యాక్సిస్‌ బ్యాంక్‌ను హోల్డ్‌ చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.540 నుంచి రూ.560కి (ప్రస్తుత ధర రూ.613) పెంచాం. రెవెన్యూ, నిర్వహణ పనితీరు ఆధారంగా చూస్తే బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. స్లిపేజ్‌లు తగ్గాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ మెరుగుపడొచ్చు. క్యాపిటల్‌ పొజిషన్‌ బలంగా ఉంది. కొత్త మేనేజ్‌మెంట్‌ (బ్యాంక్‌ కొత్త చీఫ్‌గా అమితాబ్‌ చౌదరీ జనవరి 1 నుంచి బాధ్యతలు చేపడతారు) నేతృత్వంలో బ్యాంక్‌ ఎలాంటి పనితీరు కబరుస్తుందో చూడాల్సి ఉంది. ప్రైవేట్‌ బ్యాంక్‌ విభాగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు ప్రాధాన్యమివ్వొచ్చు. 

హిందాల్కో: కొనొచ్చు
హిందాల్కోపై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.340గా (ప్రస్తుత ధర రూ.238) నిర్ణయించాం. ధర ఒత్తిళ్లు ఉన్నా కూడా కంపెనీ దేశీ అల్యూమినియం వ్యాపార విభాగం అంచనాలు మించిన వృద్ధిని నమోదు చేసింది. బలమైన ఎర్నింగ్స్‌ అంచనాలు, రుణ భారం తగ్గింపు వంటివి సానుకూల అంశాలు. కంపెనీ పనితీరు మెరుగుపడినప్పటికీ స్టాక్‌ మాత్రం డౌన్‌ట్రెండ్‌లోనే ఉంది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, అల్యూమినియం ధరలు తక్కువగా ఉండటం, కోల్‌ ధర ఎక్కువగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం. 

సిటీ యూనియన్‌ బ్యాంక్‌: హోల్డ్‌ చేయొచ్చు 
సిటీ యూనియన్‌ బ్యాంక్‌ను హోల్డ్‌ చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.165 నుంచి రూ.160కి (ప్రస్తుత ధర రూ.164) తగ్గిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) బ్యాంక్‌ రెవెన్యూ అంచనాలు మించింది. అయితే నిర్వహణ లాభం తగ్గింది. రుణ వృద్ధి ఆరోగ్యకరంగా ఉంది. క్యాపిటల్‌ పొజిషన్‌ బలంగా ఉంది. బిజినెస్‌ మోడల్‌, రిటర్న్‌ రేషియో బాగుండటం వంటివి సానుకూల అంశాలు. రుణ నాణ్యత బాగుంది. మార్జిన్లు పెరిగాయి. 


  



You may be interested

సిటీ యూనియన్‌ బ్యాంక్‌ను కొనొచ్చు : ఆనంద్‌రాఠి

Saturday 10th November 2018

స్థిరమైన పనితీరుతో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న సిటీ యూనియన్ బ్యాంక్ షేరును కొనొచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఆనంద్‌ రాఠి సిఫార్సు చేస్తుంది. తమిళనాడు కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ రంగ సంస్థ సిటీ యూనియన్ బ్యాంక్‌ మొత్తం 607 బ్రాంచులున్నాయి. అందులో అత్యధికంగా తమిళనాడులోనే ఏకంగా 418 బ్రాంచులు ఉన్నాయి. బ్యాంక్‌ ఎక్కువగా చిన్న, మధ్య ఎంటర్‌ప్రైజెస్‌(ఎస్‌ఎంఈ) సంస్థలకు రుణాలు కేటాయింపునకు ప్రాధాన్యత ఇస్తుంది. రూ.2.50 లక్షల నుంచి రూ.10లక్షల

2 కొనొచ్చు.. 1 హోల్డ్‌ చేయొచ్చు..

Saturday 10th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..  ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఇండోస్టాక్‌ క్యాపిటల్‌పై సెంట్రమ్‌ బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. స్టాక్‌కు టార్గెట్‌ ప్రైస్‌ను రూ.450గా (ప్రస్తుత ధర రూ.327) నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలు మించాయని పేర్కొంది. మార్జిన్లు మెరుగుపడ్డాయని తెలిపింది. రుణ నాణ్యత ఆరోగ్యకరంగా ఉందని పేర్కొంది. క్యాపిటల్‌

Most from this category