STOCKS

News


2 కొనొచ్చు.. 1 హోల్డ్‌ చేయొచ్చు..

Saturday 10th November 2018
Markets_main1541835846.png-21867

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం.. 

ఇండోస్టార్‌ క్యాపిటల్‌
ఇండోస్టాక్‌ క్యాపిటల్‌పై సెంట్రమ్‌ బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. స్టాక్‌కు టార్గెట్‌ ప్రైస్‌ను రూ.450గా (ప్రస్తుత ధర రూ.327) నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలు మించాయని పేర్కొంది. మార్జిన్లు మెరుగుపడ్డాయని తెలిపింది. రుణ నాణ్యత ఆరోగ్యకరంగా ఉందని పేర్కొంది. క్యాపిటల్‌ పొజిషన్‌ బలంగా ఉందని తెలిపింది. అంచనాల కన్నా తక్కువ వృద్ధి, వ్యయాల పెరుగుదల వంటివి రిస్క్‌ అంశాలని పేర్కొంది. 

సనోఫి ఇండియా
సనోఫి ఇండియాపై కూడా సెం‍ట్రమ్‌ పాజిటివ్‌గా ఉంది. బై రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.7,920గా (ప్రస్తుత ధర రూ.6,177) నిర్ణయించింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలు మించాయని పేర్కొంది. నికర లాభం (వార్షికంగా 3 శాతం వృద్ధి), ఆదాయం (వార్షికంగా 11 శాతం వృద్ధి) పెరిగాయని, అయితే మార్జిన్లు తగ్గాయని తెలిపింది. రూపాయి క్షీణత సానుకూల అంశమని పేర్కొంది. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ వల్ల లాభదాయకత పెరగొచ్చని తెలిపింది. రానున్న కాలంలో ఈబీటా మార్జిన్లు పెరగొచ్చని అంచనా వేసింది. 

ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌
ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌ షేరును హోల్డ్‌ చేయవచ్చని సెంట్రమ్‌ సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,150 నుంచి రూ.945కి (ప్రస్తుత ధర రూ.901) తగ్గించింది. పండుగ సీజన్‌ ఆలస్యమవ్వడంతో గృహోపకరణాల విభాగంపై ఒత్తిడి నెలకొంటుందని అంచనా వేసింది. పోటీ పెరుగుదల కారణంగా విక్రయాల వృద్ధిపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. రూపాయి క్షీణత, సరుకు రవాణా వ్యయాలు ఎగయడం, సీఎస్‌ఆర్‌ పెరుగుదల వంటి పలు అంశాల వల్ల నిర్వహణ మర్జిన్ల పెరుగుదల పరిమితంగానే ఉండొచ్చని తెలిపింది. కస్టమ్స్‌ డ్యూటీ పెరుగుదల వల్ల స్థూల మార్జిన్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇంజనీరింగ్‌ విభాగం వల్ల కంపెనీకి ప్రయోజనం ఉంటుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ ఫలితాలు నిరుత్సాహపరిచాయని పేర్కొంది. 

కంపెనీల పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...
 

View Pdf One (1541835882IndoStar Capital - Q2FY19 Result Update - Centrum 01112018.pdf)
View Pdf Two (1559124337Sanofi India - Q3CY18 Results Update - Centrum 01112018.pdf) View Pdf Three (1025597633IFB Industries - Q2FY19 Result Update - Centrum 01112018.pdf)

You may be interested

సెంట్రమ్‌ స్టాక్‌ సిఫార్సులు..

Saturday 10th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం.. సన్‌ టీవీ నెట్‌వర్క్‌: కొనొచ్చు సన్‌ టీవీ నెట్‌వర్క్‌ స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,170 నుంచి రూ.1,060కి (ప్రస్తుత ధర రూ.623) తగ్గిస్తున్నాం. ‍ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో అడ్వర్టైజింగ్‌ రెవెన్యూలో వృద్ధి నిరుత్సాహకరంగా ఉంది. అయితే రెండో అర్ధ భాగంలో వృద్ధి బాగుంటుందని అంచనా వేస్తున్నాం. పండుగ

10,750 దాటేవరకు భారీ లాభాలు ఉండకపోవచ్చు..!

Saturday 10th November 2018

ముంబై: శుక్రవారం సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టంతో 35,158 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. ఉదయం 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. అంతక్రితం ముగింపుతో పోల్చితే 17 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఇంట్రాడేలో 10,619 పాయింట్ల వద్ద గరిష్టస్థాయిని, 10,545 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. అంతకుముందు వారంతో పోల్చితే గడిచిన వారంలో నిఫ్టీ 32 పాయింట్లు లాభంతో ముగిసింది. మొత్తం మీద

Most from this category