STOCKS

News


కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ కొనొచ్చు..

Saturday 15th September 2018
Markets_main1536992479.png-20287

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెం‍ట్రమ్‌ తాజాగా కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ స్టాక్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: సెం‍ట్రమ్‌
స్టాక్‌: కిర్లోస్కర్‌ ఫెర్రస్‌
ఇండస్ట్రీ: మెటల్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.140
ప్రస్తుత ధర: రూ.99
అప్‌సైడ్‌: 42 శాతం

సెంట్రమ్‌ తాజాగా కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.140గా నిర్ణయించింది. కేఎల్‌డీ మైన్‌ను కోల్పోవడం కంపెనీకి పాజిటివ్‌ అంశమని పేర్కొంది. కేఎల్‌డీ మైన్‌ను వేలంలో తొలిగా కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ సొంతం చేసుకుంది. అయితే బిడ్డింగ్‌లో కొన్ని టెక్నికల్‌ సమస్యల వల్ల అధికారులు మళ్లీ వేలం నిర్వహించారు. రెండోసారి వేలంలో కేఎల్‌డీ మైన్‌ ఎంఎస్‌పీఎల్‌కు చేతికి వెళ్లింది. కిర్లోస్కర్‌ ఫెర్రస్‌.. కేఎల్‌డీ మైన్‌కు అధిక ఆఫర్‌ ప్రైస్‌ను కోట్‌ చేసింది. ఒకవేళ కేఎల్‌డీ మైన్‌ కంపెనీకి వచ్చి ఉంటే.. అప్పుడు ‍ప్రతికూల ప్రభావం పడేదని పేర్కొంది. గతంలో వేరొక వేలంలో సొంతం చేసుకున్న బీఎంఎం మైన్‌ వల్ల కంపెనీకి ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. బలమైన ఎర్నింగ్స్‌ అంచనాలున్నాయని పేర్కొంది. అందువల్ల బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నామని, రూ.140 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1536992489Kirloskar Ferrous - Event Update - Centrum 14092018.pdf)

You may be interested

7,000లోపు ఏ ఫోన్‌ బెటర్‌?

Saturday 15th September 2018

ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ఇటీవల కాలంలో పోటీ బాగా పెరిగింది. కంపెనీలు తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. రూ.7,000లోపు ధరలోని టాప్‌-4 స్మార్ట్‌ఫోన్లను కింద ఇచ్చాం. అవేంటో ఒకసారి చూద్దాం..   ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌-2.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.45 అంగుళాల డిస్‌ప్లే (18:9 రేషియో), 1.5 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌ కోర్‌ మీడియాటెక్‌ ఎంటీ 6739 ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌/16 జీబీ మెమరీ లేదా 3

పసిడి పడింది..

Saturday 15th September 2018

పసిడి ధరకు అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాల పోటు తగిలింది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో 10 డాలర్లు నష్టపోయింది. ఆటోమొబైల్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రంగాల మెరుగైన పనితీరు కారణంగా అమెరికాలో ఆగస్ట్‌లో పారిశ్రామికోత్పత్తి 0.4 శాతం వృద్ధిని సాధించింది. దీంతో మార్కెట్‌ వర్గాలకు మరోసారి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు పెరిగాయి. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ శుక్రవారం ఇంట్రాడేలో 95.00 కీలక స్థాయిని తాకింది. అయితే చివరకి అరశాతం లాభంతో

Most from this category