STOCKS

News


ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ తిరస్కరణకు గురైతే??

Saturday 14th July 2018
personal-finance_main1531555530.png-18317

ఒక ప్రాంతాన్ని చూడటానికి టూర్‌ వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు. అందుకే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ట్రావెల్‌ చేసేటప్పుడు ట్రిప్‌ రద్దవ్వడం, బ్యాగేజ్‌ తస్కరణ, ఊహించని ప్రమాదాలు, విదేశాల్లో పాస్‌పోర్ట్‌ కనిపించకుండా పోవడం, మెడికల్‌ ఎమర్జెన్సీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్‌ పాలసీ మనకు భరోసానిస్తుంది. అయితే కొన్నిసార్లు  దురదృష్టవశాత్తు పాలసీ ఉన్నా కూడా ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ రిజెక్ట్‌ అవ్వొచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఇలా అవ్వచ్చొ ఒకసారి చూద్దాం..

మద్యంతో చేటు..
మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుంది. ఇది అందరికీ తెలుసు. అయితే దీని వల్ల ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కూడా రద్దవొచ్చు. సరదాగా టూర్‌కు వెళ్లాం కదా అని మద్యం తాగి ఆదమరుపుగా ఉంటే సమస్య రావొచ్చు. మద్యం తాగి ఉన్నప్పుడు ఏమైనా నష్టం కలిగితే.. అప్పుడు ఆ నష్టాన్ని క్లెయిమ్‌ చేస్తే.. అది తిరస్కరణకు గురికావొచ్చు. అలాగే డ్రగ్స్‌ తీసుకున్నా అంతే. క్లెయిమ్‌ వర్తించదు. 

విలువైన వస్తువులతో జాగ్రత్త
మీ విలువైన వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మీ నిర్లక్ష్యం వల్లే వస్తువులు కనిపించకుండా వెళ్లాయని తెలిస్తే మాత్రం ఇన్సూరెన్స్‌ కంపెనీలు మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయి. అందుకే జువెలరీ, హ్యాండ్‌బ్యాగ్స్‌, బ్యాగేజీ, కెమెరా వంటి వస్తువులను ఎక్కడపడితే అక్కడ వదిలేయకండి. బయట కారులో వదిలేసి వెళ్లిపోకండి. వెంటే ఉంచుకోండి.  

పోలిస్‌ స్టేట్‌మెంట్‌లో ఆలస్యం వద్దు
మీ వస్తువు ఏదైనా తస్కరణకు గురైతే వెంటనే దగ్గరిలోని పోలిస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. వారి స్టేట్‌మెంట్‌ తీసుకోండి. దాన్ని వెంటనే ఇన్సూరెన్స్‌ కంపెనీలకు పంపించండి. 24 గంటలలోగా ఈ తతంగా ముగిసేలా చూడండి. కొన్ని కంపెనీలు ఈ గడువు దాటిన తర్వాత పంపితే మీ క్లెయిమ్‌ను తిరస్కరించొచ్చు.  

పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోండి
తీసుకున్న పాలసీ గురించి పూర్తి తెలుసుకోవడం మీ బాధ్యతే. పాలసీని పూర్తిగా చదవండి. అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏవేవి పాలసీలో కవర్ అవుతాయి. ఏవి పాలసీలో కవర్‌ అవ్వవో అర్థమౌతుంది. కొన్నిసార్లు మీరు తీసుకున్న పాలసీ మీ నష్టాన్ని కవర్‌ చేయకపోవచ్చు. అప్పుడు క్లెయిమ్‌ సులభం రిజెక్ట్‌ అవుతుంది. 
 
 



You may be interested

ట్రేడ్‌వార్‌తో వీటికి లాభం!

Saturday 14th July 2018

మేడ్‌ ఇన్‌ ఇండియాకు జోరంటున్న నిపుణులు  యూఎస్‌ ఆరంభించిన వాణిజ్యయుద్దం పరోక్షంగా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు వరంలాంటిదని ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం చైనా దాదాపు 50వేల కోట్ల డాలర్ల విలువైన ఎలక్ట్రిక్‌ మెషినరీ, 38వేల కోట్ల డాలర్ల విలువైన కంప్యూటర్‌ మెషనరీ, 8900 కోట్ల డాలర్ల విలువైన ఫర్నిచర్‌ బెడ్డింగ్‌, లైటింగ్‌ను, 15వేల కోట్ల డాలర్ల విలువైన క్లోతింగ్‌, యాక్సెసరీస్‌ను, 7000 కోట్ల డాలర్ల విలువైన మెడికల్‌ సామాగ్రిని, అంతే

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీఓకు సెబీ ఓకే..!

Saturday 14th July 2018

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 3,000-3,500 కోట్ల సమీకరణకు సిద్ధమైంది. ప్రైస్‌బ్యాండ్‌ రూ.1,200-1,500ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఐపీఓలో భాగంగా 2.54 కోట్ల షేర్లను జారీ చేయనుంది. వీటిలో 3.20 లక్షల షేర్లను సంస్థ ఉద్యోగులకు, 24 లక్షల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ హోల్డర్లకు కేటాయించారు. మిగతా మొత్తం

Most from this category