STOCKS

News


కరెంట్‌ అకౌంట్‌ లోటు భయాలు

Saturday 8th December 2018
news_main1544241031.png-22754

ముంబై: దేశంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) భయాలు నెలకొన్నాయి. రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) నమోదయిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే క్యాడ్‌ 2.9 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 19.1 బిలియన్‌ డాలర్లు. రెండవ త్రైమాసికంలో ఇది  15.9 బిలియన్‌ డాలర్లే (జీడీపీలో 2.4 శాతం). గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 6.9 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 1.1శాతం). కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) జీడీపీలో క్యా్‌డ్‌ 1.8 శాతం నుంచి 2.7 శాతానికి పెరిగింది.   ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్యం (ఎప్‌ఐఐ, డీఐఐ, ఈసీబీలుమినహా) మధ్య నికర వ్యత్యాసమే కరెంట్‌ అకౌంట్‌లోటు.  దిగుమతుల బిల్లు తగ్గింపు, ఎగుమతుల పెంపుసహా పలు మార్గాల ద్వారా క్యాడ్‌ను కట్టడి చేయాల్సి ఉంటుంది. ఎక్కువ క్యాడ్‌ ఆ దేశాన్ని ఇతర దేశాలకు రుణగ్రస్థ దేశంగా మార్చుతుంది. క్యాడ్‌ పెరుగుదల కరెన్సీ విలువల పతనానికీ దారితీస్తుంది. ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు పెరగడం తాజా క్యాడ్‌ గణాంకాలు పెరగడానికి కారణం. 



You may be interested

పెట్రోల్‌లో రెట్టింపు స్థాయికి ఇథనాల్

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్‌లో పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 8 శాతానికి చేరే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు మిల్లులకు తక్కువ వడ్డీపై ‍మరింతగా రుణాలు లభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చక్కెర ఉత్పత్తి సంస్థల సమాఖ్య ఐఎస్‌ఎంఏ 84వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి

రూ.24 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు గత నెలలో 8 శాతం ఎగసి రూ.24 లక్షల కోట్లకు పెరిగాయి. లిక్విడ్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులు జోరుగా పెరగడంతో ఫండ్‌ ఆస్తులు ఈ స్థాయిలో పెరిగాయని యాంఫీ(అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా) పేర్కొంది. సంపద వృద్ధికి మ్యూచువల్‌ ఫండ్స్‌ తగిన సాధనాలన్న అంచనాలతో వచ్చే ఏడాది ఫండ్స్‌ల్లో మరింత జోరుగా పెట్టుబడులు వస్తాయని వివరించింది.  ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇతరత్రా అంశాలపై యాంఫీ

Most from this category