STOCKS

News


ఆర్‌ఈసీలో వాటాల విక్రయానికి ఓకే

Friday 7th December 2018
news_main1544161609.png-22723

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు (పీఎఫ్‌సీ) మొత్తం 52.63 శాతం వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్‌ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా భావించినప్పటికీ... విద్యుత్ శాఖ జోక్యంతో ప్రతిపాదన మారింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేంద్రానికి ఆర్‌ఈసీలో 57.99 శాతం, పీఎఫ్‌సీలో 65.64 శాతం వాటాలు ఉన్నాయి. ‍అయితే, ఈటీఎఫ్‌ ద్వారా కొన్ని వాటాలను విక్రయించడంతో ఆర్‌ఈసీలో కేంద్రం హోల్డింగ్ 52.63 శాతానికి తగ్గింది.
మరోవైపు, 2022 నాటికి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను రెట్టింపు స్థాయిలో 60 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంలో భాగంగా కొత్త వ్యవసాయ ఎగుమతి విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టీ, కాఫీ, బియ్యం వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను పెంచుకోవడానికి, అంతర్జాతీయ ‍అగ్రి-ట్రేడ్‌లో మరింత వాటా దక్కించుకునేందుకు ఇది దోహదపడగలదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, ఉత్పత్తులకు ప్రమాణాలు నెలకొల్పడం, నిబంధనలను క్రమబద్ధీకరించడం, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించడం వంటి అంశాలకు ఈ విధానం కింద ప్రాధాన్యం లభించనున్నట్లు ఆయన వివరించారు. 



You may be interested

ఎన్‌హెచ్‌పీసీ చేతికి ల్యాంకో తీస్తా ప్రాజెక్ట్‌  !

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ల్యాంకో తీస్తా హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ రంగ కంపెనీ ఎన్‌హెచ్‌పీసీ చేజిక్కించుకుంది. భారీ రుణ భారంతో కుదేలైన ల్యాంకోకు చెందిన ఈ 500 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను దివాలా ప్రక్రియలో భాగంగా ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ తాత్కాలిక విలువను రూ.900 కోట్లుగా మదింపు చేశారు.  సిక్కిమ్‌లోని తీస్తా నదిపై నిర్మాణమవుతున్న  ఈ ప్రాజెక్ట్‌ను ఎన్‌హెచ్‌పీసీ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తిగా టేకోవర్‌ చేస్తుందని అంచనా.

టాప్‌ 100 శక్తివంత మహిళల్లో మనవాళ్లు నలుగురు

Friday 7th December 2018

న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు చోటు దక్కింది. హెచ్‌సీఎల్‌ ఎంటర్‌ప్రైజ్‌ రోష్ని నాడార్‌ మల్హోత్ర, బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, హిందుస్థాన్‌ టైమ్స్‌ శోభన భర్తియ, ప్రముఖ సినీతార ప్రియాంక చోప్రా ఈ జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందితో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానంలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ నిలిచారు.

Most from this category