STOCKS

News


జెన్‌సర్‌ టెక్నాలజీస్‌పై పాజిటివ్‌

Saturday 8th December 2018
Markets_main1544261898.png-22771

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా జెన్‌సర్‌ టెక్నాలజీస్ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌
స్టాక్‌: జెన్‌సర్‌ టెక్నాలజీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.230
టార్గెట్‌ ప్రైస్‌: రూ.257

కోటక్‌ సెక్యూరిటీస్‌.. జెన్‌సర్‌ టెక్నాలజీస్‌పై సానుకూలముగా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.257గా నిర్ణయించింది. కంపెనీ తన ఆర్‌వోడీ నెక్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా డిజిటల్‌ విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, ఈ అంశం సంస్థ భవిష్యత్‌ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, పోటీని ఎదుర్కునేందుకు కంపెనీ గత రెండేళ్లలో నాలుగు కంపెనీలను కోనుగోలు చేసిందని గుర్తు చేసింది. సంస్థ డిజిటల్‌ ఆదాయంలో మంచి వృద్ధి నమోదు అవుతూ వస్తోందని పేర్కొంది. అలాగే కంపెనీ మంచి డీల్స్‌ను గెలుచుకుంటోందని తెలిపింది.  దీర్ఘకాలంలో కంపెనీ మంచి పనితీరు కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. అందువల్ల స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కాగా జెన్‌సర్‌ టెక్నాలజీస్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌ను, టెక్నాలజీ సర్వీసులను అందిస్తుంది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1544261945Zensar_06Dec18_Kotak_PCG_00599.pdf)

You may be interested

ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌కు బై రేటింగ్‌

Saturday 8th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.105 టార్గెట్‌ ప్రైస్‌: రూ.145 కోటక్‌ సెక్యూరిటీస్‌.. ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.145గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో కంపెనీ ఆరోగ్యకరమైన పనితీరు కనబర్చిందని పేర్కొంది. రానున్న కాలంలో మంచి

రికార్డు స్థాయికి చైనా నవంబర్‌ వాణిజ్య మిగులు

Saturday 8th December 2018

చైనా వాణిజ్య మిగులు గతేడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో రికార్డు స్థాయిలో వాణిజ్య మిగులును సాధించింది. నవంబర్‌లో ఆ దేశ వాణిజ్య మిగులు 44.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే నవంబర్‌లో సాధించిన 35 బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులుతో పోలిస్తే ఇది 21శాతం అధికం. ట్రేడ్‌ వార్‌లో భాగంగా అమెరికా దిగుమతులపై నిషేదాన్ని విధించడంతో వాణిజ్య మిగులు రికార్డు స్థాయిని చేరినట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎగుమతులు,

Most from this category