స్మాల్, మిడ్‌క్యాప్స్ కొనొచ్చు!
By D Sayee Pramodh

మోర్గాన్‌స్టాన్లీ సూచన
చిన్న, మధ్యతరహా స్టాక్స్‌ను కొనుగోలు చేసే సమయం వచ్చిందని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడుతోంది. ప్రధాన సూచీలతో పోలిస్తే చిన్న స్టాకులు చూసిన కరెక్షన్ దృష్టితో చూస్తే వీటిని ఇక కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇకమీదట సూచీలు క్రమానుగత రికవరీ చూపుతాయని, ముఖ్యంగా ప్రధాన సూచీలకు స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలకు మధ్యకల వ్యత్యాసం క్రమంగా తగ్గుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈవ్యత్యాసం ఆల్‌టైమ్ గరిష్ఠాలకు దగ్గరగా ఉందని తెలిపింది. వాల్యూషన్లు గణనీయంగా తగ్గాయని, చాలావరకు డీరేటింగ్ చోటు చేసుకుందని మోర్గాన్‌స్టాన్లీ వివరించింది. ఈ నేపథ్యంలో చిన్న స్టాకులు కొనుగోళ్ల జోన్‌కి చేరినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. గతేడాది కాలంలో మిడ్‌క్యాప్ సూచీ 16 శాతం స్మాల్‌క్యాప్ సూచీ 27 శాతం పతనమయ్యాయి.
చిన్నస్టాకులు కొనొచ్చని భావిస్తున్న వేళ ఇంద్రప్రస్థగ్యాస్, ఇండియన్ హోటల్స్, సైయంట్, ఇప్కాల్యాబ్, జస్ట్ డయిల్, అమర్‌రాజా, అపోలో హాస్పిటల్స్, ఎడెల్వీజ్ ఫైనాన్షియల్స్, జుబిలాంట్ ఫుడ్‌వర్క్స్, ఒబెరాయ్ రియల్టీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేర్లను బ్రోకరేజ్ సంస్థ రికమండ్ చేసింది. ఈ షేర్లకు ఓవర్‌వెయిట్ రేటింగ్ ఇచ్చింది. వీటి వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, ప్రస్తుతం సరసమైన ధరల వద్ద ఈ షేర్లు ట్రేడవుతున్నాయని తెలిపింది. రాబోయే రెండేళ్లలో ఈ షేర్లు మంచి ఆర్ఓసీ నమోదు చేస్తాయని, ఈ కంపెనీల ఎర్నింగ్స్ మంచి వృద్ధి నమోదు చేస్తాయని అంచనా వేసింది.
You may be interested
రూపాయి ర్యాలీ: నష్టాల్లో ఐటీ షేర్లు
Tuesday 12th February 2019డాలర్ మారకంలో రూపాయి బలపడటంతో మంగళవారం ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల తగ్గుదల ప్రభావంతో దేశీయ కరెన్సీ గతఆరు ట్రేడింగ్ సెషన్ల నుంచి లాభ పడుతోంది. నేడు ఫారెక్స్ మార్కెట్లో 71.17 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపాయి క్రమంగా పుంజుకుంటూ 21పైసలు బలపడింది. రూపాయి ర్యాలీతో డాలర్ల మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ రంగానికి
కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాలు
Tuesday 12th February 2019అమరరాజా లాభం రూ.129 కోట్లు డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో అమరరాజా నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.134 కోట్ల నుంచి రూ.129 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,570 కోట్ల నుంచి రూ.1,707 కోట్లకు ఎగసింది. ఏప్రిల్-డిసెంబరు పీరియడ్‌లో రూ.5,267 కోట్ల టర్నోవరుపై రూ.363 కోట్ల నికరలాభం ఆర్జించింది. హెచ్‌బీఎల్ పవర్ లాభం రూ.7.3 కోట్లు.. క్యూ3లో హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే