STOCKS

News


అర్వింద్‌ కొనొచ్చు..

Friday 7th December 2018
Markets_main1544165707.png-22726

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా అర్వింద్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

‍బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌
స్టాక్‌: అర్వింద్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.100
టార్గెట్‌ ప్రైస్‌: రూ.130

కోటక్‌ సెక్యూరిటీస్‌.. అర్వింద్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.130గా నిర్ణయించింది. కంపెనీ తన వ్యాపారాన్ని విడగొట్టి అర్వింద్‌ ఫ్యాషన్స్‌, అనూప్‌ ఇంజినీరింగ్‌ అనే రెండు ప్రత్యేకమైక కంపెనీలను ఏర్పాటు చేసిందని పేర్కొంది. దీని వల్ల మొత్తంగా మూడు లిస్టెడ్‌ కంపెనీలు ఆవిర్భవిస్తాయని, వీటి వల్ల ఆయా వ్యాపారాలపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించవచ్చని తెలిపింది. కంపెనీ మేనేజ్‌మెంట్‌ దీర్ఘకాలంలో ఈ కంపెనీలపై పాజిటివ్‌గా ఉందని పేర్కొంది. అర్వింద్‌ ఫ్యాషన్స్‌, అనూప్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలు 2019 ఫిబ్రవరిలో మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యే అవకాశముందని తెలిపింది. డీమెర్జర్‌ తర్వాత అర్వింద్‌.. టెక్స్‌టైల్స్‌, మెటీరియల్స్‌ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొంది. భవిష్యత్‌ వృద్ధి అంచనాలు బాగున్నాయని తెలిపింది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1544165717Arvind_05Dec18_Kotak_PCG_00598.pdf)

You may be interested

కోటక్‌ బ్యాంక్‌లో బఫెట్‌ పెట్టుబడి

Friday 7th December 2018

14శాతం ర్యాలీ చేసిన షేరు ప్రైవేటు రంగ కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు షేరు శుక్రవారం 14శాతం ర్యాలీ చేసింది. వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్కషైర్ హాత్వే కోటక్‌ బ్యాంక్‌లో 10శాతం వాటాను కోనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడం ఇందుకు కారణమైంది. సుమారు 4మిలియన్‌ డాలర్ల నుంచి 6మిలియన్‌ డాలర్ల మధ్యలో ఈ మొత్తం వాటాను బెర్కషైర్ హాత్వే కొనుగోలు చేయవచ్చని తెలుస్తుంది. ప్రమోటర్‌ నుంచి కొనుగోలు చేయడం ద్వారా లేదా

నాలుగేళ్లలో... 5జీ!

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సర్వీసులపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 2022 నాటికల్లా దేశీయంగా కూడా ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యదర్శి ఎస్‌.కె.గుప్తా చెప్పారు. ఆ పై ఐదేళ్లలో డిజిటల్ మాధ్యమం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి వినియోగదారుల ధోరణుల్లో మార్పులు తేగలవని గుప్తా చెప్పారు. ‘‘కొన్నాళ్లుగా మీడియా పరిశ్రమలో నాటకీయ మార్పులు

Most from this category