STOCKS

News


జీఎస్‌టీ ఆడిట్‌ రిపోర్టులను ఫైల్‌ చేయండి

Tuesday 16th April 2019
Markets_main1555394810.png-25162

- రూ.2 కోట్ల టర్నోవర్‌ దాటితే ఫైలింగ్‌ తప్పనిసరి

న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్‌టీ ఆడిట్‌ రిపోర్టులు దాఖలు చేయడానికి (జీఎస్‌టీఎన్‌) నెట్‌వర్క్‌లో ఫార్మెట్‌ సిద్ధంగా ఉందని కౌన్సిల్‌ ప్రకటించింది. ఫైలింగ్‌కు ఆఖరి తేదీ జూన్‌ 30 కాగా, రూ.2 కోట్ల టర్నోవర్‌ దాటితే ఫైలింగ్‌ తప్పనిసరని సోమవారం ప్రకటించింది. డిసెంబర్‌లోనే ఇందుకు సంబంధించిన ఫామ్‌లు.. జీఎస్‌టీఆర్‌-9 (సామాన్య ట్యాక్స్‌ పేయర్లకు), జీఎస్‌టీఆర్‌-9ఏ (కాంపోజిషన్‌ ట్యాక్స్‌ పేయర్లకు), జీఎస్‌టీఆర్‌-9సీ (రికన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్‌)లను కౌన్సిల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.



You may be interested

జెట్‌ఎయిర్‌ 4.50శాతం డౌన్‌

Tuesday 16th April 2019

నిధుల సమీకరణ అంశంపై స్పష్టత రాకపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ షేర్లు మంగళవారం మరో 4శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.254.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ అత్యవసర కార్యకలాపాల నిర్వహణకు మూలధన నిధుల సమీకరించే అంశంపై సోమవారం బ్యాంకర్లు, యాజమాన్యంతో చర్చలు జరిపారు. చర్చలు సుధీర్ఘంగా జరిగినప్పటికీ ఇరువర్గాలు తుది నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో సమావేశాన్ని నేటి వాయిదా చేస్తున్నట్లు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌

‘ఏ సిరీస్‌’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో శాంసంగ్‌ రికార్డు

Tuesday 16th April 2019

40 రోజుల్లో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. తన ‘ఏ సిరీస్‌’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో రికార్డు సృష్టించినట్లు సోమవారం ప్రకటించింది. కేవలం 40 రోజుల్లోనే ఏకంగా 20 లక్షల యూనిట్ల విక్రయాలు పూర్తిచేయగా.. వీటి విలువ దాదాపు రూ.3,500 కోట్లని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రంజివిజిత్ సింగ్ వెల్లడించారు. చిన్న నగరాలు, మెట్రోల నుంచి ఏ50, ఏ30,

Most from this category