STOCKS

News


11300 పాయింట్ల పైనే బుల్స్‌కు పట్టు

Friday 17th May 2019
Markets_main1558071745.png-25787

నిఫ్టీ మరింత అప్‌మూవ్‌ చూపాలంటే 11300 పాయింట్ల పైన బలంగా క్లోజవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఊగిసలాట అనంతరం బుల్స్‌ సూచీలపై పట్టు చూపారు. దీంతో సూచీలు ఆరంభ నష్టాలను అధిగమించాయి. నిఫ్టీ తన 100 రోజుల డీఎంఏ స్థాయి 11250 పాయింట్ల పైన స్థిరంగా క్లోజయింది. బుల్స్‌ ఇకపై పూర్తిగా పట్టుబిగించాలంటే 11300 పాయింట్ల పైన స్థిరపడాల్సిఉంటుంది. గురువారం చమురు గ్యాస్‌, రియల్టీ, పవర్‌ సూచీలు మంచి జోరు చూపాయి. వీఐఎక్స్‌ కొంత శాంతించినా ఇప్పటికీ నాలుగేళ్ల గరిష్ఠం వద్దే ఉంది. దీన్ని బట్టి నిఫ్టీ పైకి ఎగిసినా, తీవ్ర కదలికలు మాత్రం తప్పవని అంచనా. ముఖ్యంగా వారంలో ఎన్నికల ఫలితాలు రానున్నందున ఈ కదలికలు మరింత బలంగా ఉంటాయి. మరోపక్క రూపాయి వరుసగా మూడో సెషన్లో కూడా బలం చూపింది. చమురు ధరలు పెరిగినా, ఈక్విటీల్లో జోరు రూపీ బలపడేందుకు కారణమయింది. గురువారం ఎఫ్‌ఐఐలు నికరవిక్రయదారులుగా మారి రూ. 953 కోట్ల అమ్మకాలు జరపగా, డీఐఐలు నికర కొనుగోలుదారులుగా మారి రూ. 948 కోట్ల కొనుగోళ్లు జరిపారు. నిఫ్టీ వరుసగా నాలుగో రోజు కూడా కీలక 11130 పాయింట్లను గౌరవించి, దాని పైనే క్లోజయింది. అందువల్ల సూచీలు కొంత బలంగానే కొనసాగవచ్చు. 11300 పాయింట్ల పైన 11500 పాయింట్ల వద్ద నిరోధం ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ నెగిటివ్‌గా మారి 11100 పాయింట్ల దిగువకు వస్తే 10700పాయింట్ల వరకు పతనమయ్యే ఛాన్సులున్నాయి. You may be interested

ఎన్నికల తర్వాత ఏవి బెటర్‌?

Friday 17th May 2019

ఈ నెల 23న ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్‌కు ఒక దిశా నిర్ధేశం రానుంది. ఫలితాల వేళ ఒడిదుడకులున్నా తర్వాత కాలంలో తిరిగి దేశీయ సూచీలు అప్‌మూవ్‌నే చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఫలితాల అనంతరం ఎలాంటి స్టాకులను ఎంచుకోవాలి? మిడ్‌క్యాప్స్‌ బెటరా? స్మాల్‌క్యాప్స్‌ బెటరా? అనే విషయమై రిటైల్‌ ఇన్వెస్టర్స్‌ డైలమాలో ఉన్నారు. గతేడాది గాయాల అనంతరం ఇప్పుడిప్పుడే చిన్న, మధ్యతరహా స్టాకులు

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 17th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎల్‌ అండ్‌ టీ:- మైండ్‌లో తన వాటాను 26శాతానికి పెంచుకుంది.  ట్రిజెన్‌ టెక్నాలజీస్‌:- హాట్సన్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌కు ఐటీ ప్లేస్‌మెంట్‌ సేవలు అందించేందుకు కాంట్రాక్టు దక్కించుకుంది. మణిప్పురం ఫైనాన్స్‌:- మణిప్పురం అస్సెట్‌ ఫైనాన్స్‌లో 100శాతం ఈక్విటీ వాటాలను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.  పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- హోల్డింగ్స్ పీటీఈ, జనరల్ అట్లాంటిక్ గ్రూపునకు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయ ప్రక్రియను రద్దు

Most from this category